JSW MG మోటార్స్ కు చెందిన MG విండ్సర్ కేవలం ఆరు నెలల్లో 20,000 కార్ల అమ్మకాలను అందుకుందని ఆ కంపెనీ ప్రకటించింది. వాస్తవానికి MG విండ్సర్ భారతదేశంలో సెప్టెంబర్ 2024లో లాంచ్ అయ్యింది. అయితే అమ్మకాలు మాత్రం అక్టోబర్ 2024లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుండి ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది.
ఈ ఎలక్ట్రిక్ MPV కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఎక్సైట్ ధర (ఎక్స్-షోరూమ్) రూ.13,99,800గా ఉంది. అదే ఎక్స్‌క్లూజివ్ ధర రూ.14,99,800, ఎసెన్స్ ధర రూ.15,99,800గా ఉంది.