Cheapest family car: కేవలం రూ.4 లక్షలకే 33 కి.మీ మైలేజ్ ఇచ్చే కారు ఇది, ఇంతకన్నా చీపెస్ట్ కారు లేదు

Published : Feb 19, 2026, 11:58 AM IST

Cheapest family car:  తక్కువ డబ్బుతో బెస్ట్ కారు కొనాలనుకుంటున్నారా? మీ కోసమే మారుతి సుజుకి ఆల్టో కే10 అందుబాటులో ఉంది. ఇది అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. జనవరి 2026లో ఏకంగా 12,314 యూనిట్లు అమ్ముడైంది. రూ.3.70 లక్షల ప్రారంభ ధరతో వస్తుంది.

PREV
14
అతి తక్కువ ధరకే ఫ్యామిలీ కారు

అతి తక్కువ ధరకరే కారు కొనాలనుకుంటున్నారా? మధ్యతరగతి వారి కోసం బెస్ట్ కారు అందుబాటులో ఉంది. భద్రత, మైలేజ్ రెండింటినీ అందించే చిన్న కారు మారుతి సుజుకి ఆల్టో కే10. ఈ జనవరి 2026లో ఏకంగా  12,314 యూనిట్లు అమ్ముడుపోయాయి. తక్కువ ఖర్చులో నమ్మకమైన కారుగా ఆల్టో మరోసారి నిరూపించుకుంది.

24
రికార్డు స్థాయిలో అమ్మకాలు

రష్‌లేన్ రిపోర్ట్ ప్రకారం, జనవరి 2025లో అమ్ముడైన 11,352 యూనిట్ల కంటే 962 కార్లు ఎక్కువగా ఈ ఏడాది అమ్ముడయ్యాయి. ఇది వార్షికంగా 8.47 శాతం వృద్ధిని సూచిస్తుంది. అంతేకాదు, డిసెంబర్ 2025లో అమ్ముడైన 10,829 యూనిట్లతో పోలిస్తే 13.71 శాతం పెరుగుదల నమోదైంది. మార్కెట్లో తీవ్రమైన పోటీ ఉన్నా కూడా ఆల్టో కారుకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.

34
సిటీ జర్నీకి బెటర్
ఈ కారును హార్ట్‌టెక్ట్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇందులో 1.0-లీటర్ K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 65.7 bhp పవర్, 89 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు, కొన్ని వేరియంట్లలో AGS ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. సిటీ ట్రాఫిక్‌కు దీని డిజైన్ పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.
44
ఎంత మైలేజ్ వస్తుంది

మైలేజ్ విషయంలో ఆల్టో కే10 కారును కొట్టే కారే లేదు.  పెట్రోల్ మోడల్ లీటర్‌కు 24.90 కి.మీ, సీఎన్‌జీ మోడల్ కిలోకు 33.40 కి.మీ మైలేజ్ ఇస్తుంది. బేస్ మోడల్‌లో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ESP వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

లోపల 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, డిజిటల్ స్పీడోమీటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.3.70 లక్షల ప్రారంభ ధర, తక్కువ మెయింటెనెన్స్, విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ కారణంగా మధ్యతరగతి ప్రజల నమ్మకాన్ని ఈ కారు నిలబెట్టుకుంటోంది. SUVల హవా నడుస్తున్నా, చిన్న కార్లకు ఇంకా ఆదరణ ఉందని ఆల్టో నిరూపించింది.

Read more Photos on
click me!

Recommended Stories