సాధారణంగా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే వారు ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా విజయవాడ రావడం కరెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే విజయవాడ అన్ని ప్రాంతాలకు సెంటర్ లో ఉంటుంది. ఇటు రాయలసీయ, నెల్లూరు సైడ్ వెళ్లొచ్చు. మరో వైపుగా కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, శ్రీకాకుళం వెళ్లొచ్చు. రెండు వైపులకు వెళ్లే వారు విజయవాడ వరకు ఫ్లైట్ లో వస్తే అక్కడి నుంచి బస్సు గాని, కారులో గాని ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది.
అందుకే ఇండిగో విమాన సంస్థ కొత్తగా ఓ ఫ్లైట్ ని స్టార్ట్ చేసింది. ఇది బెంగళూరు మీదుగా మధురై టు విజయవాడ వరకు వెళుతుంది. ముఖ్యంగా మధురై నుంచి స్టార్ట్ చేయడానికి కారణం.. టూరిస్టులను ఆకర్షించేందుకు. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి ఈ సమయంలో ఎక్కువ మంది విహార యాత్రలకు వెళతారు. ముఖ్యంగా తమిళనాడులో అనేక దేవాలయాలను చూడటానికి ఫ్యామిలీలతో సహా వెళుతుంటారు. అందుకే ఇండిగో విమాన సంస్థ ఒక కొత్త ఫ్లైట్ ని మధురై నుంచి ప్రారంభించింది.
ఎప్పటి నుంచి ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
చెన్నై, కోయంబత్తూరు తర్వాత మధురై పెద్ద నగరం. మధురైని దేవాలయాల నగరం, నిద్రించని నగరం అని కూడా పిలుస్తారు. మధురై నుండి బెంగళూరు మీదుగా విజయవాడకు ఇండిగో ఎయిర్‌లైన్స్ కొత్త విమాన సర్వీసును మార్చి 30 నుండి ప్రారంభించనుంది.
ఇది కూడా చదవండి అయోధ్య వెళ్తే ఈ 10 అద్భుతమైన ప్రదేశాలు తప్పక చూడండి
ఫ్లైట్ టైమింగ్స్ ఏంటి..
కొత్త ఇండిగో విమాన సర్వీసులో ప్రయాణికులు బెంగళూరులో అదే విమానంలో 30 నిమిషాలు ఉండి తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 8.15 గంటలకు మధురై నుండి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో విజయవాడ నుండి సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి రాత్రి 7:25 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ విమానం టికెట్ ధర రూ.6,000 నుండి ప్రారంభమవుతుంది.