ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌ను అద్దెకిచ్చి డ‌బ్బులు సంపాదించొచ్చు.. ఏం ఐడియా గురూ అస‌లు

Published : Nov 13, 2026, 07:17 PM IST

Lumo: ఏదైనా వస్తువు ఒకటి రెండు రోజులు మాత్రమే అవసరమైనప్పుడు దాన్ని కొనుగోలు చేయడం కంటే అద్దెకు తీసుకుంటే డబ్బు ఆదా అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్‌తో వ‌చ్చిందే లుమో యాప్‌. ఇంత‌కీ యాప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

PREV
15
లుమో అంటే ఏంటి.?

లుమో అనేది ఒక పీర్-టు-పీర్ (Peer-to-Peer) రెంటల్ మార్కెట్‌ప్లేస్. అంటే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువులను మరో వ్యక్తికి అద్దెకు ఇచ్చే విధంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంది. సాధారణంగా మన ఇళ్లలో కెమెరాలు, గేమింగ్ కన్సోల్స్, టెంట్లు, స్పీకర్లు, పనిముట్లు వంటి ఎన్నో వస్తువులు ఉంటాయి. వాటిని అప్పుడప్పుడు మాత్రమే ఉపయోగిస్తుంటాం. మిగతా సమయంలో అవి ఖాళీగా ఉంటాయి. అలాంటి వస్తువులను Lumoలో లిస్ట్ చేసి ఇతరులకు అద్దెకు ఇవ్వొచ్చు.

అదే సమయంలో ఎవరికైనా ఏదైనా వస్తువు కొద్దిరోజులు అవసరమైతే ఈ యాప్‌లో వెతికి తమకు సమీపంలో ఉన్న వ్యక్తి నుంచి అద్దెకు తీసుకోవచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ బెంగళూరులో ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో విస్త‌రిస్తోంది. సంస్థ అందించిన వివరాల ప్రకారం బెంగళూరులో 78, ముంబైలో 31, ఢిల్లీ NCRలో 57, హైదరాబాద్‌లో 61, చెన్నైలో 19, పుణెలో 19, కోల్‌కతాలో 22, అహ్మదాబాద్‌లో 8, జైపూర్‌లో 3, కొచ్చిలో 4 లిస్టింగ్స్ ఉన్నాయి. వీటితో పాటు ఇతర పట్టణాల్లో మరో 185 లిస్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి.

25
యాప్‌లో ఎలాంటి వస్తువులు అద్దెకు లభిస్తాయి?

లుమో యాప్‌లో మొత్తం 25 రకాల కేటగిరీలకు చెందిన వస్తువులను అద్దెకు తీసుకునే అవకాశం ఉంది. కేవలం కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులకే పరిమితం కాకుండా ఇంటి అవసరాలు, వినోదం, ప్రయాణాలు, క్రీడలు, వేడుకలకు సంబంధించిన అనేక వస్తువులు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా కెమెరాలు, డ్రోన్లు, ఆడియో, వీడియో పరికరాలు, గేమింగ్ కన్సోల్స్, కంప్యూటర్లు, ఆఫీస్ పరికరాలు, టెంట్లు, క్యాంపింగ్ సామగ్రి, స్పోర్ట్స్, ఫిట్‌నెస్ పరికరాలు అద్దెకు లభిస్తాయి. అలాగే ఫర్నిచర్, గృహోపకరణాలు, వంటగది పరికరాలు, పార్టీ స్పీకర్లు, ఈవెంట్ పరికరాలు, సంగీత వాయిద్యాలు, శుభ్రపరిచే పరికరాలు కూడా ఉన్నాయి.

ఇవే కాకుండా చిన్నారుల కోసం బేబీ గేర్, బొమ్మలు, పిల్లల ఆట వస్తువులు, వైద్య అవసరాలకు ఉపయోగించే పరికరాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన సామగ్రి కూడా కొన్ని లిస్టింగ్స్‌లో అందుబాటులో ఉన్నాయి. ఎత్నిక్ వేర్, నగలు, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఆటో యాక్సెసరీస్ వంటి వాటిని కూడా అద్దెకు తీసుకోవచ్చు.

సంస్థ అందించిన జాబితాలో ఎత్నిక్ వేర్ విభాగంలో 102, స్పోర్ట్స్ అండ్ ఫిట్‌నెస్‌లో 92, కెమెరాలు అండ్ డ్రోన్లలో 74, ఆడియో అండ్ వీడియోలో 62, గేమింగ్ విభాగంలో 26 లిస్టింగ్స్ ఉన్నాయి. అవసరమైన వస్తువు ఏదైనా ఉంటే యాప్‌లో సెర్చ్ చేసి అందుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు.

35
ఈ యాప్ ఎలా ప‌నిచేస్తుంది.? అద్దెకు ఎలా తీసుకోవాలి.?

ఈ యాప్‌లో వస్తువును అద్దెకు తీసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ముందుగా లుమో యాప్‌లోకి వెళ్లి మీకు కావాల్సిన వస్తువును వెతకాలి. మీ ప్రాంతానికి సమీపంలో ఉన్న లిస్టింగ్స్‌ను పరిశీలించి, వస్తువు వివరాలు, రోజువారీ అద్దె ధర, సెక్యూరిటీ డిపాజిట్ వంటి వివరాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత వస్తువును ఎన్ని రోజులు ఉపయోగించాలనుకుంటున్నారో తేదీలను ఎంపిక చేసుకుని యాప్‌లోనే బుకింగ్ చేయాలి. అద్దె మొత్తంతో పాటు సెక్యూరిటీ డిపాజిట్ కూడా చెల్లించాలి. ఈ డిపాజిట్‌ను లుమో తన వద్ద ఉంచుకుంటుంది. వస్తువును పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది సెల్ఫ్ కలెక్షన్. ఇందులో మీరు యజమాని ఉన్న ప్రాంతానికి వెళ్లి వస్తువును తీసుకోవాలి. తిరిగి కూడా అదే యజమానికి అప్పగించాలి. ఈ విధానంలో అదనపు డెలివరీ ఛార్జీలు ఉండవు.

రెండోది డెలివరీ సదుపాయం. కొన్ని లిస్టింగ్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. అలాంటి సందర్భాల్లో Lumo రైడర్ లేదా వస్తువు యజమాని మీ ఇంటికి వస్తువును తీసుకొచ్చి ఇస్తారు. అద్దె పూర్తయ్యాక తిరిగి వచ్చి తీసుకెళ్తారు. ఇందుకు సంబంధించిన ఛార్జీలు బుకింగ్ సమయంలోనే యాప్‌లో చూపిస్తారు. వస్తువు చేతికి అందినప్పుడు యజమానితో కలిసి దాన్ని పరిశీలించి ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. అద్దె కాలం ముగిసిన తర్వాత తిరిగి ఇచ్చే సమయంలోనూ ఇదే విధంగా ఫొటోలు తీసుకోవాలి. యజమానికి వస్తువు తిరిగి అందిన తర్వాత, ఆయన నిర్ధారించినప్పుడు Lumo సెక్యూరిటీ డిపాజిట్‌ను సెటిల్ చేస్తుంది.

45
అద్దె ధరలు, సెక్యూరిటీ డిపాజిట్, రద్దు నిబంధనలు ఏమిటి?

లుమో యాప్‌లో ప్రతి వస్తువుకు యజమాని రోజువారీ అద్దె ధరను నిర్ణయిస్తారు. కాబట్టి అన్ని వస్తువులకు ఒకే ధర ఉండదు. వస్తువు రకం, దాని విలువ, వినియోగం, యజమాని నిర్ణయించిన ధరను బట్టి అద్దె మారుతుంది. బుకింగ్ చేసే ముందు మొత్తం ఎంత చెల్లించాలో యాప్‌లో స్పష్టంగా చూపిస్తారు.

ఉదాహరణకు ఒక కెమెరా లేదా ఇతర వస్తువుకు రోజుకు రూ.800 అద్దె ఉందనుకుందాం. దాన్ని రెండు రోజుల పాటు అద్దెకు తీసుకుంటే రూ.1,600 అద్దె చెల్లించాలి. దీనికి అదనంగా రూ.5,000 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. ఈ డిపాజిట్‌ను యజమాని నేరుగా తీసుకోకుండా లుమో తన వద్ద ఉంచుకుంటుంది. వస్తువు తిరిగి ఇచ్చిన తర్వాత యజమాని నిర్ధారించడంతో డిపాజిట్‌ను సెటిల్ చేస్తుంది.

ఇక బుకింగ్ రద్దు చేసుకోవాలనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. మొదటి అద్దె రోజు ప్రారంభానికి 12 గంటల కంటే ముందుగా క్యాన్సిల్ చేస్తే అద్దె, ఇతర ఫీజులతో సహా పూర్తి డబ్బు తిరిగి వస్తుంది. సంస్థ వివరించిన సమయ లెక్క ప్రకారం మొదటి అద్దె రోజు ముందు రోజు మధ్యాహ్నం 12 గంటలలోపు రద్దు చేస్తే పూర్తి రీఫండ్ లభిస్తుంది.

చివరి 12 గంటల్లో బుకింగ్ రద్దు చేస్తే అద్దె, ఫీజులపై 10 శాతం మొత్తాన్ని Lumo ఉంచుకుంటుంది. అయితే సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం పూర్తిగా తిరిగి వస్తుంది. బుకింగ్ చేసుకునే ముందు యాప్‌లోని పూర్తి క్యాన్సిలేషన్ పాలసీని పరిశీలించడం మంచిది.

55
దీని ప్రత్యేకతలు ఇవే..

ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వస్తువులను అద్దెకు తీసుకునేవారితో పాటు అద్దెకు ఇచ్చేవారికీ ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఒక వస్తువును జీవితంలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగించాల్సి వచ్చినప్పుడు దాన్ని కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒకరోజు పార్టీ కోసం స్పీకర్, రెండు రోజుల ట్రిప్ కోసం టెంట్, పెళ్లి వేడుక కోసం కెమెరా కావాలంటే అద్దెకు తీసుకోవచ్చు. దీంతో కొత్త వస్తువు కొనడానికి పెట్టే పెద్ద మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు.

మరోవైపు ఇంట్లో ఖాళీగా ఉన్న వస్తువుల ద్వారా యజమానులు అదనపు ఆదాయం సంపాదించవచ్చు. ఉదాహరణకు మీ దగ్గర మంచి కెమెరా, గేమింగ్ కన్సోల్, డ్రిల్లింగ్ మెషిన్ లేదా పార్టీ స్పీకర్లు ఉన్నాయనుకుందాం. వాటిని ఇతరులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చు. ఎంత అద్దె వసూలు చేయాలనేది యజమానే నిర్ణయిస్తారు. అయితే వస్తువు అద్దెకు వెళ్లిన రోజులు, బుకింగ్స్ సంఖ్యను బట్టి ఆదాయం మారుతుంది.

లుమో లక్ష్యం కేవలం అద్దె సేవలు అందించడమే కాదు. ఒకరి దగ్గర ఉపయోగించకుండా ఉన్న వస్తువు మరొకరికి ఉపయోగపడేలా చేయడం. దీనివల్ల ప్రజలు అదనపు ఆదాయం పొందడంతో పాటు అవసరమైన వస్తువులను తక్కువ ఖర్చుతో ఉపయోగించుకోవచ్చు. కొత్త వస్తువుల కొనుగోళ్లు తగ్గడం వల్ల వనరుల వృథా కూడా కొంతవరకు తగ్గుతుంది. మొత్తంగా చూస్తే వస్తువులు కొనడం కంటే అవసరమైనప్పుడు అద్దెకు తీసుకోవాలనుకునే వారికి, ఇంట్లో ఖాళీగా ఉన్న వస్తువులతో ఆదాయం సంపాదించాలనుకునే వారికి ఇది ఒక ప్రత్యామ్నాయ వేదికగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories