మళ్లీ పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధరలు.. డొమెస్టిక్‌పై రూ.25, కమర్షియల్‌ సిలిండర్‌పై రూ .95 పెంపు..

First Published Mar 1, 2021, 11:19 AM IST

 ఒక పక్క పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారులని ఆందోళనకు గురిచేస్తుంటే మరోపక్క  వంట గ్యాస్‌ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నేడు సబ్సిడీతో కూడిన  గ్యాస్ సిలిండర్ల ధర మరోసారి పెరిగింది. మార్చి 1 నుంచి అంటే  నేటి నుంచి దేశీయ ఎల్‌పిజి సిలిండర్ ధర రూ .25 పెరగటంతో ఇప్పుడు 14.2 కిలోల సిలిండర్ ధరను 794-819 రూపాయలకు పెంచారు.

అంతకుముందు అంటే ఫిబ్రవరి 25న కూడా ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ .25 పెంచారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ల ధరను రూ .25 పెంచిన తరువాత, ఇప్పుడు కొత్త ధర 845.50 రూపాయలకు చేరింది, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను కూడా రూ .19 పెంచారు.
undefined
డిసెంబర్ 1న ఎల్‌పిజి ధరను రూ .594 నుంచి రూ .644 కు పెంచారు. దీని తరువాత జనవరి 1 న దీనిని 644 రూపాయల నుండి 694 రూపాయలకు పెంచారు. ఫిబ్రవరి 4న 694 నుండి 719 రూపాయలకు పెంచారు, ఆ తరువాత ఫిబ్రవరి 15న 719 నుండి 769 కు పెంచారు.
undefined
దీని తరువాత ఫిబ్రవరి 25న ఎల్‌పిజి గ్యాస్ ధర 25 రూపాయలు పెంచటంతో రూ.794 కు పెరిగింది. ఇప్పుడు మార్చి 1న అంటే నేడు గ్యాస్ సిలిండర్ల ధర 25 రూపాయలు పెంచడంతో కొత్త ధర రూ .819 కు చేరింది. దీంతో ఒక్క నెలరోజుల వ్యవధిలోనే సిలిండర్‌ ధర రూ.100లకు పైగా భారం కావడం గమనార్హం.
undefined
పెరిగిన ధరతో చెన్నైలో గ్యాస్ సిలిండర్ల ధర రూ .835 కు చేరింది. 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఢీల్లీలో ఇప్పుడు 1,614 రూపాయలకు పెరిగింది. అంతకుముందు దీని ధర రూ .1,523.50గా ఉంది. ముంబైలో రూ .1,563.50, చెన్నైలో రూ .1,730.50, కోల్‌కతాలో 1,681.50 రూపాయలకు పెరిగింది. హైదరాబాదులో రూ.846.50గా ఉన్న సిలిండర్ ధర ప్రస్తుతం రూ.871.50కి చేరింది. బెంగళూరులో రూ.823, చెన్నైలో రూ.835, ముంబైలో రూ.819, కోల్‌కతాలో రూ.845కి చేరింది.
undefined
click me!