ముకేష్ అంబానీ ఒక్క కారు ధర ఎంతో తెలుసా.. ప్రత్యేకంగ డిజైన్ చేసిన వీటి గురించే తెలిస్తే ఆశ్చర్యపోతారు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేష్ అంబానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన పారిశ్రామికవేత్తలలో ఒకరు. భారతదేశపు అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీకి చాలా ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి, ఇలాంటి కార్లను చాలా మంది ప్రజలు కొనుగోలు చేయాలని కలలుకంటున్నారు. అంతేకాదు ముకేష్ అంబానీ విలాసవంతమైన ఇల్లు ఆంటిలియా కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఈ 27 అంతస్తుల ఇంట్లో ఒక అంతస్తులో 168 కార్ల పార్కింగ్  సామర్ధ్యం ఉందని విషయం తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. అంబానీ కార్ల కలెక్షన్ లో రోల్స్ రాయిస్, బెంట్లీ, మెర్సిడెస్ అత్యంత లగ్జరీ కార్లు ఉన్నాయి. ముకేష్ అంబానీ అత్యంత విలువైన లగ్జరీ కార్లు గురించి తెలుసుకోండి...
 

భారతదేశంలోని వివిఐపిలో ఒకరైన ముకేష్ అంబానీ కొంతకాలం క్రితం అల్ట్రా లగ్జరీ కార్ మెర్సిడెస్ బెంజ్ 660 గార్డ్ ను కొనుగోలు చేశారు. ముకేష్ అంబానీ గ్యారేజీలో ఉన్న అత్యంత సురక్షితమైన కార్లలో ఇది కూడా ఒకటి. ఈ కారు మేబాచ్ ఎస్ 600 అర్మడ్ వెర్షన్. వీఆర్ 10 లెవెల్ రక్షణ పొందిన మొదటి సివిల్ వాహనం ఇది. అంటే స్టీల్ బుల్లెట్లు కూడా ముకేష్ అంబానీ కారును ప్రభావితం చేయలేవు. ఇది 2 మీటర్ల దూరంలో ఉన్న 15 కిలోల టిఎన్‌టి పేలుడును కూడా తట్టుకోగలదు.
మెర్సిడెస్ బెంజ్ ఎస్ 600 కారుకు 6.0-లీటర్ 12-సిలిండర్, బై-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఈ కారు 523 బిహెచ్‌పి శక్తిని, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీని ఇంజిన్ 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు సస్పెన్షన్ గురించి చెప్పాలంటే అధిక బరువును కూడా మోసే విధంగా రూపొందించారు, దీంతో పాటు చాలా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఇస్తుంది. ఈ కారు ప్రారంభ ధర రూ .10 కోట్లు. కానీ అంబానీ ఇందులో టాప్ వెర్షన్‌ను కొనుగోలు చేసి ఉండొచ్చు, దీనికి కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

మెర్సిడెస్ మేబాచ్ 62ముకేష్ అంబానీకి తన పుట్టినరోజున మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ 62 కారును అతని భార్య నీతా అంబానీ బహుమతిగా ఇచ్చారు. ఈ కారును మరింత ప్రత్యేకంగా ఉంచడానికి నీతా అంబానీ కారును కస్టమైజ్ చేశారు. మేబాచ్ 62 కారు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. మెర్సిడెస్ మేబాచ్ 62 కారు ఎక్స్ షోరూమ్ ధర రూ .5.15 కోట్లతో ప్రారంభమవుతుంది.
బెంట్లీబెంట్లీ తయారు చేసిన మొట్టమొదటి ఎస్‌యూవీ కారు బెంట్లీ బెంటాయిగా. కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎస్‌యూవీ టైటిల్‌ను కూడా ఈ కారు పొందింది. ఈ కారు గంటకు 301 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. ఈ స్పీడ్ చాలా వరకు స్పోర్ట్స్ కార్లలో కూడా లేదు. దీనికి 6.0-లీటర్ 12-సిలిండర్ ఇంజిన్‌ అందించారు, ఇది 600 హెచ్‌పి శక్తిని, 900 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 4.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ కారు బరువు 3,250 కిలోలు. బెంట్లీ బెంటెగా కారు ధర రూ .7.6 కోట్లు.
బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ముకేష్ అంబానీ గ్యారేజీలో ఉన్న బెంట్లీ యొక్క రెండవ కారు ఇది. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ ప్రపంచంలోని అత్యంత పాపులర్ లగ్జరీ కార్లలో ఒకటి. బాలీవుడ్ సినీ ప్రపంచంలో చాలా మంది తారలు బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కార్లను కలిగి ఉన్నారు. బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ డబ్ల్యూ 12 ఎస్ సంస్థలో అత్యంత వేగవంతమైన కారు. ఈ కారు కేవలం 4.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కాగా దాని టాప్ స్పీడ్ గంటకు 325 కిలోమీటర్లు. ఈ కారుకి 6.0-లీటర్ ట్విన్ టర్బో డబ్ల్యూ 12 ఇంజిన్‌ అందించారు, ఇది 626 బి‌హెచ్‌పి శక్తిని, 820ఎన్‌ఎం టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ డ్రాప్‌హెడ్ కూపే ముకేష్ అంబానీ గ్యారేజీలోని రోల్స్ రాయిస్ డ్రాప్‌హెడ్ కూపే కారు కూడా ఉంది. ఈ కారుకు 6.75-లీటర్, 12-సిలిండర్ ఇంజన్ తో వస్తుంది, ఇది 549 బిహెచ్‌పి శక్తిని, 750 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ. ఈ కారు టాప్ స్పీడ్ చేరుకోవడానికి 5 సెకన్ల కన్నా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. భారతదేశంలో ఈ కారు ధర సుమారు 7.6 కోట్లు.
రోల్స్ రాయిస్ ఫాంటమ్రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుకి 6.75-లీటర్, 12-సిలిండర్ల ఇంజన్ లభిస్తుంది, ఇది 549 బిహెచ్‌పి శక్తిని, 750 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో రోల్స్ రాయిస్ ఫాంటమ్ 8వ జనరేషన్ కారు ధర రూ.9.5 కోట్ల నుండి ప్రారంభమవుతుంది. ఇది ఇప్పటికీ అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.
టెస్లా మోడల్ ఎస్ 100 డిముకేష్ అంబానీ కార్ల సేకరణలో రోల్స్ రాయిస్, బెంట్లీ, మెర్సిడెస్ బెంజ్ వంటి కార్లతో పాటు టెస్లా మోడల్ ఎస్ ఎలక్ట్రిక్ కారు కూడా ఉంది. అయితే ఇది ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేదు. ఒక నివేదిక ప్రకారం ముకేష్ అంబానీ ఈ కారును బయటి దేశం నుండి 2018లో దిగుమతి చేసుకున్నారు. మోడల్ ఎస్ కారు 423 పిఎస్ శక్తిని, 660 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేసిన తర్వాత 495 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ కారు కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. భారతదేశంలో ఈ కారు ధర సుమారు రూ .1.5 కోట్లు.

Latest Videos

click me!