మనలో చాలామందికి నెలవారీ ఆదాయం తక్కువగానే ఉంటుంది. వాటిని జాగ్రత్తగా ఖర్చు పెడితేనే ఇళ్లు గడుస్తుంది. కానీ ఎంత సంపాదించినా అందులో కొంత మొత్తాన్ని పొదుపు చేయడం మంచిదంటారు పెద్దలు. మరి తక్కువ ఆదాయం ఉన్నప్పుడు ఎలా పొదుపు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
చాలామంది తమ సంపాదనలో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేయాలి అనుకుంటారు. కానీ ఆశించిన ఆదాయం లేనప్పుడు పొదుపు చేయడం కష్టంగా మారుతుంది. అయితే కాస్త దృష్టి పెడితే తక్కువ ఆదాయం ఉన్నవారు సైతం ఈజీగా డబ్బులు పొదుపు చేయవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.
25
ఖర్చులపై అవగాహన
మీ ఆదాయం తక్కువగా ఉన్నా.. దానికి తగ్గ పొదుపు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే డబ్బులు సేవ్ చేయడం ఈజీ అవుతుంది. మొదట మీ నెలవారీ ఖర్చులను తగ్గించే అంశాలను గుర్తించండి. ఆదాయం, ఖర్చులను ఒక పట్టిక రూపంలో రాసుకోండి. నెలలో మొదటి రోజునే మీ బడ్జెట్ ను సెట్ చేసుకోండి. దానికి కట్టుబడి ఉండేందుకు ప్రయత్నించండి.
35
పొదుపు శాతాన్ని పెంచుకోండి.
నెలవారీ ఇంటి అద్దె, ఇతర ఖర్చుల కోసం చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సింగిల్ అయితే.. మరొకరితో రూమ్ షేర్ చేసుకోండి. దానివల్ల ఖర్చులు భారంగా మారవు. ఖర్చులు తగ్గుతూ పోతున్నప్పుడు పొదుపు మొత్తాన్ని కొంచెం పెంచుతూ పోవాలి. మీ ఆదాయంలో దాదాపు 30 శాతం పొదుపు చేసేందుకు ప్రయత్నించాలి.
ప్రయాణ ఖర్చులు
ప్రస్తుతం చాలామందికి ప్రయాణ ఖర్చులు ఎక్కువవుతున్నాయి. మీకు కూడా అది పరిస్థితి ఉంటే.. తక్కువ దూరాలకు సొంత వాహనం ఉపయోగించండి. దూరపు ప్రయాణాలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడండి. దానివల్ల శ్రమ, సమయం, డబ్బు ఆదా అవుతుంది.
అనవసరమైన ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నించండి. ఏదైనా వస్తువు కొనేముందు అది ఎంతవరకు అవసరమో మరోసారి ఆలోచించుకోండి. కొత్తది కొనడానికి బదులు సెకండ్ హ్యాండ్ వస్తువు లేదా.. తక్కువ ధరలో లభించే క్వాలిటీ వస్తువులను ఎంచుకోండి.
55
బీమా పాలసీలు
తక్కువ ఆదాయం ఉన్నవారు.. ఆకస్మాత్తుగా వచ్చే అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులపాలు కావాల్సి వస్తుంది. కాబట్టి మీ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి తీసుకోండి. బీమా పాలసీ తీసుకోవడం కూడా డబ్బు పొదుపు చేయడం కిందకే వస్తుంది.
ఆర్డీ, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మన ఆదాయాన్ని పెంచుకోవచ్చు. వీటిని చాలా తక్కువ మొత్తంతో కూడా ప్రారంభించవచ్చు.