Recharge plan: టెలికం కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో రకరకాల ప్లాన్స్‌ను పరిచయం చేస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ కాలం వ్యాలిడిటీతో కూడిన ప్లాన్స్‌వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. అలాంటి ఒక బెస్ట్ స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రిలయన్స్ జియో ఎప్పుడూ తన వినియోగదారుల కోసం విభిన్నమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. వీటిని వినియోగదారుల అవసరాలను బట్టి వర్గాలుగా విభజించి, ప్రతి ఒక్కరికీ ఉపయోగపడేలా రూపొందించారు. కాలింగ్, డేటా, SMS – అన్నింటినీ కవర్ చేసే ఈ ప్లాన్‌లు, తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్వీస్ కోరుకునే వారికి మంచి ఆప్షన్‌గా మారాయి.
25
ఏడాది పాటు చెల్లుబాటు – రూ. 895 ప్లాన్
తరచుగా రీచార్జ్ చేయడం ఇష్టం లేని వారికోసం జియో ప్రత్యేకంగా ఒక లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తోంది. దీని ధర రూ. 895 మాత్రమే. మొత్తం 336 రోజుల చెల్లుబాటు కలిగిన ఈ ప్లాన్‌లో 24GB డేటా (ప్రతి 28 రోజులకు 2GB) లభిస్తుంది. అదనంగా 28 రోజులకు 50 SMSలు, అలాగే JioTV, JioCinema, JioCloud వంటి యాప్స్ ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. రోజువారీ ఖర్చు చూస్తే కేవలం రూ. 2.66 మాత్రమే అవుతుంది.
35
OTT యాక్సెస్ ఉన్న జియో ప్యాక్స్
ఇటీవలి కాలంలో టెలికాం కంపెనీలు తమ ప్లాన్‌లతో పాటు OTT సబ్స్క్రిప్షన్ కూడా ఇస్తున్నాయి. జియో కూడా ఈ పోటీలో వెనకడుగు వేయలేదు. కొన్ని రీచార్జ్ టారిఫ్‌లలో Netflix, Amazon Prime, Disney+ Hotstar వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లకు ఉచిత యాక్సెస్ అందిస్తోంది.
జియో అందిస్తున్న అత్యంత చౌకైన ప్యాక్‌లలో ఇది ఒకటి. రూ. 198 ధరతో వచ్చే ఈ ప్లాన్‌కు 14 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ప్రతిరోజూ 2GB డేటా, 100 SMSలు, అపరిమిత కాలింగ్ లభిస్తాయి. అదనంగా JioTV, JioCloud యాక్సెస్ తో పాటు అపరిమిత 5G డేటా కూడా లభిస్తుంది.
55
రూ. 200 లోపు జియో, ఎయిర్‌టెల్, Vi ప్లాన్‌లు
బడ్జెట్‌లో మంచి ప్లాన్ కావాలనుకునే వారికి జియోతో పాటు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (Vi) కూడా ఆకర్షణీయమైన ప్యాక్స్ అందిస్తున్నాయి. రూ. 200 లోపు లభించే ఈ ప్యాక్స్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా, SMS, OTT యాక్సెస్ వంటి అన్ని అవసరాలు కవర్ అవుతాయి. తక్కువ ఖర్చుతో పూర్తి ప్రయోజనాలను పొందాలనుకునే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు.