అన్నింటికీ పాన్ కార్డే
నేటి ఆర్థిక ప్రపంచంలో పాన్ కార్డు అత్యవసరం. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి ITR ఫైలింగ్, రుణాలు, క్రెడిట్ కార్డ్ దరఖాస్తుల వరకు అన్నింటికీ ఇది అవసరం. మనం చేసే ప్రతి ఆర్థిక లావాదేవీలు ఇందులో నిక్షిప్తం అయి ఉంటాయి.
పాన్ కార్డ్ పోతే ఏం చేయాలి?
పాన్ కార్డ్ పోయినా లేదా దొంగిలించబడినా, ముందుగా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. ఎవరైనా మీ పాన్ కార్డ్‌ను దుర్వినియోగం చేయకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యం.
ఆన్‌లైన్‌లో డూప్లికేట్ పాన్ కార్డ్
డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. NSDL వెబ్‌సైట్‌ను తెరిచి “పాన్ కార్డ్ పునఃముద్రణ” విభాగానికి వెళ్లండి. పాన్ నంబర్, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, GSTIN (ఉంటే) మరియు కాప్చా నమోదు చేయాలి. చిరునామా ధృవీకరణ అయిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేస్తే మీ సమాచారం ధృవీకరించబడుతుంది.
₹50 చెల్లించి పొందండి
డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం ₹50 రుసుము ఉంటుంది. UPI, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు వెంటనే చెల్లించవచ్చు. చెల్లింపు తర్వాత మీకు రసీదు లభిస్తుంది. NSDL పోర్టల్ నుండి మీ దరఖాస్తు స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు.
ఆఫ్‌లైన్ దరఖాస్తు ఎలా?
మీరు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. NSDL సైట్ నుండి దరఖాస్తును డౌన్‌లోడ్ చేసి, పూరించండి. ఆధార్ కార్డ్, చిరునామా రుజువు వంటి అన్ని డాక్యుమెంట్లను మరియు పూర్తి చేసిన ఫారమ్‌ను తీసుకొని పాన్ కార్డ్ కేంద్రానికి వెళ్లండి. అక్కడ ప్రక్రియ పూర్తి చేసి రసీదు పొందండి.
ఇంటికే పాన్ కార్డ్
ప్రక్రియ పూర్తయిన 10-15 రోజుల్లో మీ పాన్ కార్డ్ మీ చిరునామాకు చేరుతుంది. NSDL వెబ్‌సైట్ నుండి మీరు ఆధార్ నంబర్‌తో ఇ-పాన్ కార్డ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్.