Poco X7 Pro
పోకో X7 ప్రో 5G స్మార్ట్ ఫోన్ 6.73 అంగుళాల ఫ్లాట్ అమోల్డ్ డిస్‌ప్లే తో లభిస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 8400 అల్ట్రా చిప్‌సెట్ ఈ ఫోన్ పవర్ ఫుల్ గా పనిచేసేలా చేస్తుంది. దీని 90W హైపర్‌ఛార్జర్‌తో ఫోన్‌ను దాదాపు 47 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
ఇక కెమెరా విషయానికొస్తే పోకో X7 ప్రో 5G కెమెరా ముందు భాగంలో 50 MP సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ ద్వారా స్టిల్ ఫోటోస్ బాగా తీయొచ్చు. వీడియోస్ తీయడానికి OIS, EIS ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. దీనితో పాటు ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా, 120° ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి.