Business Idea: ఖాళీ స్థలాన్ని ఇలా ఉపయోగించుకోండి.. రూ. 20 వేల పెట్టుబడితో రూ. 3 లక్షల వరకు ఆదాయం

Published : Mar 03, 2025, 05:27 PM IST

ప్రస్తుతం చాలా మందిలో వ్యాపారం చేయాలనే ఆలోచన పెరుగుతోంది. దీంతో వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నారు. మారిన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రజల అవసరాలకు అనుగుణంగా వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటి ఒక బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం..   

PREV
14
Business Idea: ఖాళీ స్థలాన్ని ఇలా ఉపయోగించుకోండి.. రూ. 20 వేల పెట్టుబడితో రూ. 3 లక్షల వరకు ఆదాయం
Lemongrass Business

ఒకప్పడు ఉద్యోగం చేసిన తర్వాత వ్యాపారం చేయాలని అనుకునేవారు. కానీ ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి. చదువు కాగానే వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదివి వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. లక్షల రూపాయాలను ఆర్జిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలాంటి పంటల్లో నిమ్మ గడ్డి సాగు ఒకటి. ఈ పంట పండిస్తూ లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు. ఇంతకీ నిమ్మసాగు ఎలా చేయాలి.? ఎంత పెట్టుబడి అవసరపడుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

24
Business Idea

ఎలా సాగు చేయాలి.? 

నిమ్మ గడ్డి సాగుకు పెద్దగా నీరు అవసరం ఉండదు. ఎలాంటి నేలలో అయినా నిమ్మగడ్డి పెరుగుతుంది. అధిక వర్షపాతం లేని ప్రాంతాలు ఈ పంటకు ఎక్కువ అనుకూలంగా చెప్పొచ్చు. ఇక నీటి పీహెచ్‌ స్థాయి 5.5 నుంచి 7.5గా ఉండొచ్చు. ఈ పంటను నిమ్మ గడ్డి రైజోమ్ కటింగ్స్ లేదా పొదల ద్వారా నాటుకోవచ్చు. ఒక్క ఎకరం భూమిలో సుమారు 15000 నుంచి 20,000 వరకు నాటుకునే అవకాశం ఉంటుంది. 

ఇక సాగు విధానానికొస్తే.. వరుసల మధ్య 40-50 సెం.మీ., మొక్కల మధ్య 30 సెం.మీ. ఖాళీ ఉండేలా చూసుకోవాలి. మొక్కలకు నిరంతరం నీరు ఉండాల్సిన పనికూడా లేదు. వారం, పదిరోజులకు ఒకసారి నీరు పోస్తే సరిపోతుంది. ఇక వీటి పెరుగుదలకు ఎలాంటి రసాయనాలు వాడాల్సిన పనికూడా లేదు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించుకోవచ్చు. ఈ గడ్డి క్రిమి వ్యాధులకు తక్కువగా గురవుతుంది. మరీ అవసరమైతే యూరియా, ఫాస్పేట్‌ వంటివి వాడొచ్చు. 
 

34

పెట్టుబడి, లాభాలు: 

ఈ నిమ్మగడ్డిని ప్రాథమికంగా రూ. 20 వేల పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు. అయితే సగటున ఒక ఎకరానికి సుమారు రూ. 25 నుంచి రూ. 50 వేల వరకు అవసరపడుతుంది. మీరే స్వయంగా పనులు చేసుకుంటే ఖర్చు మరింత కలిసొస్తుంది. ఒక ఎకరంలో పండిన నిమ్మ గడ్డి నుంచి సుమారు 100 నుంచి 150 లీటర్ల నిమ్మగడ్డి నూనె వస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో నిమ్మగడ్డి నూనె ధర లీటర్‌కు రూ. 1000 నుంచి రూ. 2000 వరకు ఉంది. అంటే ఒక ఎకరంలో పండిస్తే సుమారు రూ. 3 లక్షల వరకు ఆదాయం పొందొచ్చు. పంట ఒక్కసారి వేస్తే 4-5 ఏళ్లు నిలుస్తుంది, సంవత్సరానికి 3-4 సార్లు కోయవచ్చు.
 

44


ఇంతకీ నిమ్మ గడ్డితో లాభాలు ఏంటంటే.? 

నిమ్మగడ్డి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటి నుంచి లభించే నూనెకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యంగా ఔషధాల తయారీ, అరోమాథెరపీ, కాస్మెటిక్ పరిశ్రమలలో దీని వినియోగం అధికంగా ఉంటుంది. ఇతర దేశాలకు కూడా ఈ నూనె పెద్ద ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. సబ్బులు, నూనెలు, సౌందర్య సాధనాల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు ఆర్జించాలనుకునే వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పొచ్చు. 

గమనిక: ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు ముందుగా అప్పటికే ఈ బిజినెస్‌ చేస్తున్న వారిని నేరుగా సంప్రదించి, ఇందులో లాభనష్టాలు అంచనా వేసుకొని ప్రారంభించడం మంచిది. 

click me!

Recommended Stories