Gold Mine: ఆ దేశంలో తవ్వే కొద్దీ బంగారమే.. ప్రపంచంలో రిచెస్ట్ గోల్డ్ మైన్ అక్కడే ఉంది

Published : Mar 02, 2025, 07:46 PM IST

Gold Mine: మీకు తెలుసా? ప్రపంచంలో బంగారం ఎక్కువగా దిగుమతయ్యే దేశాల్లో ఇండియా టాప్‌లో ఉంటుంది. మరి అతి పెద్ద బంగారం గని ఉన్న దేశం ఏంటి? ఆ బంగారం గని నుంచి సంవత్సరానికి ఏకంగా 48 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోందట. ఈ మైన్ ఎక్కడ ఉంది? దీని ప్రత్యేకతలు ఏమిటి? అనే విషయాలు తెలుసుకుందాం రండి. 

PREV
14
Gold Mine: ఆ దేశంలో తవ్వే కొద్దీ బంగారమే.. ప్రపంచంలో రిచెస్ట్ గోల్డ్ మైన్ అక్కడే ఉంది

ప్రపంచంలోనే అతిపెద్ద, రిచెస్ట్ గోల్డ్ మైన్ అయిన గ్రాస్ బెర్గ్ ఇండోనేషియాలో ఉంది. ప్రపంచంలో కొన్ని శతాబ్దాలుగా గోల్డ్ మైనింగ్ ఒక పెద్ద పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. కొన్ని దేశాల్లో పెద్ద గోల్డ్ మైన్స్ ఆ దేశ  అభివృద్ధికి కారణమవుతాయి. అలాంటి ఒక గోల్డ్ మైన్ ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఉంది. సాధారణంగా గ్రాస్ బెర్గ్ అని పిలిచే ఈ మైన్ ప్రపంచంలోనే అతిపెద్ద, రిచెస్ట్ గోల్డ్ మైన్. 

24

కొన్ని నివేదికల ప్రకారం ఈ మైన్ ఏటా దాదాపు 48 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ మైన్ కు సంబంధించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది బంగారంతో పాటు ప్రపంచంలోనే అతిపెద్ద కాపర్ మైన్స్ లో ఒకటిగా ఉంది. గ్రాస్ బెర్గ్ మైన్ నుండి సేకరించిన ఖనిజంలో ఎక్కువ మొత్తంలో బంగారం, రాగి రెండూ ఉన్నాయి.

ఇండోనేషియాలోని పుంకాక్ జయ సమీపంలో ఉన్న గ్రాస్ బెర్గ్ మైన్.. పపువాలోని ఒక ఎత్తైన పర్వతం. ఈ మొత్తం ప్రాంతం టెక్టోనిక్ ప్లేట్ల మార్పు వల్ల ఏర్పడింది. అందువల్ల ఇక్కడ ఖనిజ నిక్షేపాలు అధికంగా ఉన్నాయి.  

బంగారం ఏ రూపంలో కొంటే ఎక్కువ లాభమో తెలుసా?

34

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మైన్

ఈ మైన్ నుండి గణనీయమైన మొత్తంలో బంగారం సేకరిస్తున్నారు. ఇండోనేషియాలోని ఈ మైన్ లో దాదాపు 20,000 మంది పనిచేస్తున్నారంటే ఇది ఎంత పెద్ద స్థాయిలో పని చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ మైన్ లో విమానాశ్రయం, పోర్టు ఉన్నాయి. ఇంకా నివాస సముదాయాలు, పాఠశాలలు, దాని ఉద్యోగుల కోసం ఆసుపత్రులు కూడా ఉన్నాయి. 

2023లో మాత్రమే గ్రాస్ బెర్గ్ మైన్ 52.9 టన్నుల బంగారం, 680,000 టన్నుల రాగి, 190 టన్నుల వెండిని ఉత్పత్తి చేసింది. 1936లో డచ్ జియాలజిస్ట్ జీన్ జాక్స్ డోసి ఇక్కడ ఖనిజ నిక్షేపాలను కనుగొన్నారు. అప్పటి నుంచి ఇక్కడ బంగారం తవ్వకాలు జరుగుతున్నాయి. 

 

44

40 బిలియన్ డాలర్ల విలువైన బంగారం 

చాలా సంవత్సరాలుగా ఇండోనేషియా విలువైన ఆస్తులలో గ్రాస్ బెర్గ్ మైన్ ఒకటి. ఇండోనేషియా ప్రభుత్వం ఫ్రీపోర్ట్-మెక్మోరాన్ కు 2041 వరకు మైనింగ్ కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. ఈ మైన్ ఇంకా 40 బిలియన్ డాలర్ల విలువైన బంగారు నిల్వలను కలిగి ఉంది. అంటే ఇక్కడ రాబోయే చాలా సంవత్సరాల వరకు ఫుల్ గా బంగారం తవ్వుకోవచ్చన్న మాట.  

 

click me!

Recommended Stories