భారతదేశంలో జన్మించిన బ్రిటీష్ జాతీయురాలు లీనా నాయర్ ట్వీడ్ సూట్‌లు, క్విల్టెడ్ హ్యాండ్‌బ్యాగ్‌లు, నం. 5 పెర్ఫ్యూమ్‌లకు పేరుగాంచిన ఫ్యామిలి ఫ్యాషన్ హౌస్‌కు నాయకత్వం వహిస్తున్న అరుదైన వ్యక్తి. 52 ఏళ్ల యూఎస్ వ్యాపారవేత్త మౌరీన్ చిక్వెట్ 2016 ప్రారంభం వరకు అంటే దాదాపు తొమ్మిదేళ్లపాటు చానెల్‌కు సిఈఓ గా ఉన్నారు.
73 ఏళ్ల ఫ్రెంచ్ బిలియనీర్ అలైన్ వర్థైమర్ అలాగే అతని సోదరుడు గెరార్డ్ వర్థైమర్‌తో కలిసి చానెల్‌ను సొంతం చేసుకున్నాడు తరువాత తాత్కాలిక ప్రాతిపదికన సిఈఓగా ఉద్యోగాన్ని కొనసాగించారు ఇప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కు మారనున్నారు. ఛానెల్‌ను 1910లో ఫ్యాషన్ లెజెండ్ గాబ్రియెల్ ప్యారిస్‌లోని రూ కాంబోన్‌లో హ్యాట్ బోటిక్‌గా స్థాపించారు.