ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021: మెటావర్స్ ఒక కొత్త ప్రపంచం, మా నాన్న కల నాకు చాలా ముఖ్యమైనది..

First Published Dec 15, 2021, 2:18 PM IST

ఫ్యూయెల్ ఫర్ ఇండియా (fuel for india)సెకండ్ ఎడిషన్ ఈరోజు అంటే డిసెంబర్ 15న ముగిసింది. ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021 మొదటి సెషన్‌కు పలువురు ఫేస్ బుక్ (Facebook) భాగస్వాములు హాజరయ్యారు. ఈ ఫేస్ బుక్ ఈవెంట్ డిజిటల్ ఇండియా ట్రాన్స్ఫార్మేషన్ పై దృష్టి సారించింది. 

ఈ ఈవెంట్  రెండవ సెషన్ రాత్రి 11.35 గంటలకు ప్రారంభమైంది. ఈ సెషన్‌కు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా హాజరుఅయ్యారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో రిలయన్స్ జియో నుండి  ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ కూడా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ పూర్తిగా వ్యాపారానికి సంబంధించినది. భారతదేశంలోని  చిన్న, పెద్ద వ్యాపార సమూహాల సి‌ఈ‌ఓలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 ఫ్యుయెల్  ఫర్ ఇండియా 2021 అంశాలు
రి-ఇమేజింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా
పవర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 
స్థానిక వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి
మహిళా సాధికారత ఎలా
కరోనా మహమ్మారి సమయంలో మొబైల్ ఎలా అతిపెద్ద ఆయుధంగా  ఎలా మారింది
డిజిటల్ ఇండియా కొత్త అధ్యాయం
సామాజిక వాణిజ్యాన్ని ఎలా  ముందుకు తీసుకెళ్లాలి 
ఆన్‌లైన్‌లో రిటైల్ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలి
మెటావర్స్ అంటే ఏమిటి

 ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021లో స్మృతి ఇరానీ తన పోర్టల్ గురించి స్పందించారు. స్మృతి ఇరానీ మాట్లాడుతూ "ఈరోజు టెక్నాలజీ చాలా సహాయం చేస్తోంది. టెక్నాలజీకి అనుగుణంగా విద్యావ్యవస్థను అప్‌డేట్ చేయాలి. కరోనా మహమ్మారి సమయంలో విద్యా రంగం తీవ్రంగా ప్రభావితమైంది. ఒక మహిళకు స్పష్టమైన ఎజెండా ఉంటే ఆమె ఎంత ఎత్తుకైనా వెళ్లవచ్చు. ముద్రా యోజన లబ్ధిదారుల్లో 70 శాతం మంది మహిళలే. గతంలో కంటే ఇప్పుడు మహిళలకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి అలాగే ఫేస్‌బుక్ వంటి సంస్థలు ఇందులో చాలా సహాయపడుతున్నాయి" అని అన్నారు.

mygov ప్రెసిడెంట్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ "గత 18 నెలలుగా, ప్రజలు వాట్సాప్ ద్వారా కరోనా అంటువ్యాధిపై సహాయం చేస్తున్నారు. API కూడా WhatsApp ద్వారా అందించబడుతుంది. ఇప్పుడు ప్రజలు వాట్సాప్ ద్వారా వ్యాక్సిన్ సర్టిఫికేట్ డౌన్‌లోడ్ చేసుకోవడం నుండి వ్యాక్సిన్ సెంటర్‌లో స్లాట్‌ను బుక్ చేసుకునే వరకు ప్రతీది చేయవచ్చు. ఇదంతా టెక్నాలజీ ద్వారానే సాధ్యమైంది" అని అన్నారు.

మీషో- సంజీవ్ బర్న్వాల్
భారతదేశంలో చాలా కాలంగా సామాజిక వాణిజ్యం కొనసాగుతోంది, అయితే టెక్నాలజి వచ్చిన తర్వాత అది చాలా పెరిగింది. మా వ్యాపారం అంతా వాట్సాప్ ద్వారానే సాగుతుందని సంజీవ్ తెలిపారు. వాట్సాప్ ద్వారా మేము నేరుగా కస్టమర్‌లను చేరుకుంటాము, ఒక విధంగా వాట్సాప్ లేకుండా అది సాధ్యం కాదు.
 

రిలయన్స్ జియో లిమిటెడ్ ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్లు ఇషా అంబానీ అలాగే ఆకాష్ అంబానీ చిన్న వ్యాపారాలను దేశానికి వెన్నెముకగా అభివర్ణించారు. కరోనా మహమ్మారి మన వ్యాపార విధానాన్ని మార్చిందని ఇషా అంబానీ అన్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న కిరాణా స్టోర్లు డిజిటల్ స్టోర్‌లుగా మార్చే సమయం ఆసన్నమైంది. రిలయన్స్‌తో అనుబంధించిన 30వేల మంది రిటైలర్లను ప్రస్తావిస్తూ రిటైల్ రంగంలో ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ స్టోర్‌లకు స్పేస్ ఉందని ఆకాష్ అంబానీ చెప్పారు. ఫేస్ బుక్  Fuel for India 2021 ఈవెంట్‌లో ఇషా అంబానీ అండ్ ఆకాష్ అంబానీ వర్చువల్గ పాల్గొన్నారు.

మెటా (facebook)చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మర్నే లెవిన్ నుండి వచ్చిన ప్రశ్నకు ఇషా అంబానీ స్పందిస్తూ, “జియో అలాగే జియోమార్ట్ ద్వారా లక్షల చిన్న రిటైలర్‌లను డిజిటల్‌గా ప్రారంభించాలనేది  మా నాన్న ముఖేష్ అంబానీ విజన్. మేము మా నాన్న విజన్ ని నెరవేర్చడానికి ఒక అడుగు దగ్గరగా ఉన్నాము, ఇది ఆకాష్‌కి అలాగే నాకు వ్యక్తిగతంగా చాలా ముఖ్యమైనది.

జియో మార్ట్ అండ్ వాట్సప్ భాగస్వామ్యం గురించి ఆకాష్ అంబానీ మాట్లాడుతూ  “వాట్సప్  ద్వారా జియో మార్ట్ లో డిజిటల్ షాపింగ్ ఇప్పుడు మెసేజ్ పంపడం లాంటిది. వినియోగదారుల కోసం డిజిటల్ షాపింగ్‌లో ఇది నిజంగా ఒక విప్లవం” అని అన్నారు.
 

జియో  బలమైన కస్టమర్ బేస్ అండ్ బడ్జెట్ సేవలను ప్రశంసిస్తూ, వాట్సాప్ ద్వారా జియో మొబైల్ రీఛార్జ్ ఎలా పని చేస్తుందని మార్నే లెవిన్ ఒక ప్రశ్న అడిగగా ఆ ప్రశ్నకు సమాధానంగా ఆకాష్ అంబానీ వాట్సాప్‌లో జియో రీఛార్జ్ చేయడం చాలా సులభం, ఇది రెండు దశల్లో పూర్తవుతుందని చెప్పారు. ఇంకా జియో వినియోగదారుల లైఫ్ సులభతరం చేస్తుంది. అలాగే వృద్ధుల గురించి ప్రస్తావిస్తూ వృద్ధులు కొన్ని సమయాల్లో బయటకు వెళ్లడం కష్టంగా ఉంటుందని, కాబట్టి వాట్సాప్ ద్వారా జియో రీఛార్జ్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుందని ఇషా చెప్పారు.

click me!