Best Post office Sceme: పోస్టాఫీసు స్కీములు ఎంతో సురక్షితమైనవి. కిసాన్ వికాస్ పత్రా స్కీములో రెట్టింపు లాభాలు అందుతాయి. దీనిలో వచ్చే వడ్డీ ఎంతో తెలుసుకోండి.
పోస్టాఫీసు పథకాల్లో కిసాన్ వికాస్ పత్రా పథకం ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ప్రభుత్వం హామీ ఇచ్చిన ఈ పథకం ద్వారా పెట్టుబడి చేసిన డబ్బు నిర్దిష్ట కాలంలో రెట్టింపు అవుతుంది. కాబట్టి భద్రతతో పాటు స్థిరమైన లాభాలు కోరుకునే వారికి ఇది మంచి అవకాశం. కిసాన్ వికాస్ పత్రా అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక చిన్న పొదుపు పథకం. ఇందులో కనీసంగా 1,000 రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తం కూడా పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. మీరు ఎంతైన పెట్టుకోవచ్చు.
24
ఎంత వడ్డీ వస్తుంది?
ప్రస్తుతం ఈ పథకంపై ఏడాదికి 7.5 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఈ వడ్డీ చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. అంటే వడ్డీ కూడా మళ్లీ వడ్డీకి చేరుతుంది. అందువల్ల పెట్టుబడి చేసిన డబ్బు సుమారు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాలు 7 నెలల్లో రెట్టింపు అవుతుంది. కాబట్టి మీరు పెట్టిన డబ్బులు ఇక్కడ డబుల్ అవుతాయి. పది లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై లక్షల రూపాయలు చేతికి అందుతాయి. కిసాన్ వికాస్ పత్రా పథకానికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. అంటే దీనికి స్టాక్ మార్కెట్ మార్పులతో సంబంధం లేదు. పూర్తి భద్రత కలిగిన పథకంగా చెప్పుకోవచ్చు. బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు వచ్చినా, మీరు పెట్టిన డబ్బు, వడ్డీ సురక్షితంగా ఉంటాయి. అందుకే గ్రామీణులు, రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులు ఎక్కువగా ఈ పథకాన్ని ఎంచుకుంటున్నారు.
34
బ్యాంక్ లోన్ కూడా వస్తుంది
ఈ పథకం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. నామినీ సౌకర్యం ఉంది. పెట్టుబడిదారు మరణించిన తర్వాత నామినీకి డబ్బు అందుతుంది. ఈ పథకానికి సంబంధించిన పత్రాన్ని ఒక వ్యక్తి నుండి మరొకరికి బదిలీ చేయవచ్చు. అవసరమైతే ఈ పత్రాన్ని బ్యాంకు లోన్‌కు తాకట్టు పెట్టుకుని లోన్ తీసుకోవచ్చు. దేశంలోని ఏ పోస్టాఫీసులోనైనా ఈ పథకాన్ని తీసుకోవచ్చు లేదా వేరే బ్రాంచ్‌కి బదిలీ చేయవచ్చు.
సాధారణంగా ఈ పథకానికి లాక్ ఇన్ పీరియడ్ 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టాక 30 నెలల కన్నా ముందు డబ్బు వెనక్కి తీసుకోలేరు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే పెట్టుబడిదారు మరణించి నప్పుడు, కోర్టు ఆదేశాల సమయంలో ముందుగా తీసుకునే అవకాశం ఉంటుంది.