వందే భారత్ ట్రైన్స్ గురించి వినే ఉంటారు కదా. చాలా స్పీడ్ గా వెళుతుంది. చాలా తక్కువ సమయంలోనే మిమ్మల్ని మీరు చేరాల్సిన ఊరికి తీసుకెళుతుంది. కాని ట్రైన్ టిక్కెట్ ధర మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. కాని ఇప్పుడు మీరు తెలుసుకోబోయే వందే భారత్ ట్రైన్ టిక్కెట్ ధర కేవలం రూ.30. టిక్కెట్ ధర ఇంత తక్కువ కాబట్టి పక్క స్టేషన్ లో దింపేస్తారని అనుకోవద్దు. టూరిస్ట్ ప్లేస్ లన్నీ చూపిస్తారు. కేవలం రూ.30 ఎక్కడ టూరిస్ట్ ప్లేస్ లు చూడవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
భారతదేశంలోని అనేక నగరాలు, జిల్లాలు, పట్టణాలకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్త వందే భారత్ రైలును అనేక రాష్ట్రాలకు అందిస్తోంది. ప్రస్తుతం వందే భారత్ రైలుకు అనేక రాష్ట్రాల నుండి డిమాండ్ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు త్వరలోనే కేరళలోని అనేక ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలు, ఇతర ప్రాంతాలను కలుపుతూ ప్రయాణించనుంది. ఇలాంటివి 10 వందే భారత్ రైళ్లు కేరళ రాష్ట్రంలో తిరగనున్నాయి. ఈ రైలు టికెట్ ధర కేవలం 30 రూపాయలే.
కేరళ రాష్ట్రం పర్యాటకులను ఆకర్షించడానికి ఈ ప్రత్యేక ఆఫర్ ఇస్తోంది. కేరళలోని అనేక మార్గాల్లో కొత్త వందే భారత్ రైలు నడుస్తుంది. ఈ ట్రైన్ తమిళనాడు వరకు సేవలందిస్తుంది. కేరళ సంస్కృతి, అందమైన ప్రదేశాలను వందే భారత్ లో ప్రయాణించడం ద్వారా చూడవచ్చు. టిక్కెట్ ధర తక్కువగా ఉండటం ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వందే భారత్ రైలు 130 కి.మీ వేగంతో నడుస్తుంది. ఈ అత్యాధునిక రైలు ప్రయాణికులకు, స్థానికులకు ఎంతో సౌకర్యవంతమైన జర్నీ అందిస్తుంది.
వందే భారత్ ట్రైన్ గురువాయూర్ శ్రీకృష్ణ దేవాలయం, తిరువనంతపురం, కొల్లం, త్రిసూర్ వంటి ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తుంది. బ్యాక్ వాటర్స్, అడవులు, పర్వతాలు, సముద్ర తీరాలు, జలపాతాలు వంటి అనేక ప్రకృతి అందాల మధ్య ఈ రైలు ప్రయాణం సాగుతుంది. అందువల్ల పర్యాటకులు ఈ జర్నీని చాలా ఆస్వాదిస్తారు. నేచర్ తో పాటు దేవాలయాలను ఈ ట్రైన్ లో చూడవచ్చు.
కొల్లం-షెన్‌కోట్టై రైలు మార్గం చాలా చారిత్రాత్మకమైనది. దట్టమైన అడవులు, కొండలు, తేన్మల జలాశయం, పాలరువి జలపాతం, రోసమల గ్రామం వంటి ప్రసిద్ధ ప్రదేశాల మీదుగా ఈ రైలు వెళుతుంది. చాలా తక్కువ ధరకే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో మీరు ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు.
ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ రైలుకు మంత్లీ పాస్ కూడా ఇస్తారు. అంతే కాకుండా అత్యాధునిక సదుపాయాలను రైల్వే డిపార్ట్ మెంట్ అందిస్తోంది. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. తక్కువ సమయంలో గమ్యస్థానానికి కూడా చేరుస్తుంది. ఈ వందే భారత్ ట్రైన్ ద్వారా కేవలం రూ.30 లకు అనేక పర్యాటక ప్రదేశాలను చూడొచ్చు.