Free Gold and Mega Prizes: ప్రస్తుతం బంగారం ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. అయితే, ధంతేరాస్, దీపావళి సందర్భంగా జియోఫైనాన్స్ “Jio Gold 24K Days” పథకం తీసుకొచ్చింది. ఇందులో మీకు 2% ఉచిత బంగారం, రూ.10 లక్షల వరకు బహుమతులు అందిస్తోంది.
దీపావళి ఆఫర్: ధంతేరాస్ కు ముందు జియోఫైనాన్స్ సూపర్ స్కీమ్
దీపావళి పండుగ సందర్భంగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JioFinance) వినియోగదారులకు ప్రత్యేక పండగ ఆఫర్‌ను ప్రకటించింది. ఉచితంగా బంగారాన్ని అందిస్తోంది. జియో గోల్డ్ 24కే డేస్ (Jio Gold 24K Days) పేరిట ప్రారంభించిన ఈ పథకం అక్టోబర్ 18 నుండి 23 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో ₹2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ బంగారం కొనుగోలు చేసిన వారికి 2 శాతం అదనపు గోల్డ్ ఉచితంగా అందించనుంది.
జియోఫైనాన్స్ లేదా మైజియో యాప్‌ల ద్వారా బంగారం కొనుగోలు చేసిన కస్టమర్లకు ఈ బోనస్ గోల్డ్ 72 గంటల్లో వారి గోల్డ్ వాలెట్‌లో జమ అవుతుంది. అదనంగా, రూ.20,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన బంగారం కొనుగోలు చేసినవారు రూ.10 లక్షల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశాన్ని పొందుతారు.
25
రూ.10 లక్షల బహుమతులు.. ఫోన్, టీవీ, గోల్డ్ నాణేలు
జియో గోల్డ్ డేస్ 24కే డేస్ పథకం కింద నిర్వహించే జియో గోల్డ్ మెగా ప్రైజ్ డ్రా (Jio Gold Mega Prize Draw)లో విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందించనున్నట్టు తెలిపింది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలు, గోల్డ్ కాయిన్లు, మిక్సర్ గ్రైండర్లు, గిఫ్ట్ వోచర్లు వంటి బహుమతులు ఉన్నాయి. ఈ విజేతల జాబితాను అక్టోబర్ 27న ఇమెయిల్, ఎస్‌ఎంఎస్ ద్వారా ప్రకటించనున్నారు.
జియోఫైనాన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ డ్రా పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తారు. వినియోగదారులు కనీసం ₹10తోనే బంగారం పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీని ద్వారా కొత్త పెట్టుబడిదారులు, చిన్న మొత్తాలతో బంగారం సొంతం చేసుకోవచ్చు.
35
సురక్షితమైన పెట్టుబడి మార్గం డిజిటల్ గోల్డ్
డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు బంగారం కొనుగోలు చేసే కొత్త ధోరణిగా మారాయి. జియోఫైనాన్స్ యాప్ ద్వారా కస్టమర్లు 24కే ప్యూర్ గోల్డ్‌ను డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. దీనికి భౌతికంగా దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. లావాదేవీలు పేపర్‌లెస్, సెక్యూర్, ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు.
జియోఫైనాన్స్ వినియోగదారులకు బంగారం కొనుగోలు, నిల్వ చేయడం, రీడీమ్ చేయడం వంటి సేవలను పూర్తిగా డిజిటల్ మార్గంలో అందిస్తోంది. ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం ధర ₹1,31,950 / 10 గ్రాములుగా ఉంది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) గుర్తింపుతో నమోదు చేసిన కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. సంస్థ క్రెడిట్, ఇన్స్యూరెన్స్, డిజిటల్ పేమెంట్స్, ఆస్తుల నిర్వహణ వంటి విభాగాల్లో సేవలు అందిస్తోంది.
జియోఫైనాన్స్, బ్లాక్‌రాక్ (BlackRock)తో అసెట్, వెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలో, అలియాంజ్ గ్రూప్ (Allianz Group)తో ఇన్స్యూరెన్స్ రంగంలో భాగస్వామ్యాలు కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్టులు రెగ్యులేటరీ అనుమతుల ఆధారంగా అమలు అవుతున్నాయి.
జియోఫైనాన్స్ యాప్ ద్వారా వినియోగదారులు లోన్, ట్రాన్సాక్షన్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఒకే ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించవచ్చు. దీని లక్ష్యం దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలను మరింతగా విస్తరించడం.
55
ఫోన్‌పే లో కూడా దీపావళి బంగారం కోనుగోలు ఆఫర్లు
డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం ఫోన్‌పే (PhonePe) కూడా ధంతేరాస్, దీపావళి సందర్భంగా గోల్డ్ పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో ₹2,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన 24కే డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన వారికి 2% క్యాష్‌బ్యాక్ (గరిష్టంగా ₹2,000) అందిస్తోంది. అక్టోబర్ 18న ఒకరోజు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది.
ఫోన్‌పే తన భాగస్వాములు MMTC-PAMP, SafeGold, Caratlane ద్వారా 99.99% స్వచ్ఛత కలిగిన గోల్డ్ అందిస్తోంది. కస్టమర్లు రోజువారీ లేదా నెలవారీ SIPల ద్వారా గోల్డ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. లావాదేవీలు సురక్షితమైన వాల్ట్‌లో భద్రంగా ఉంటాయి.
జియోఫైనాన్స్, ఫోన్‌పే రెండూ ఈ ధంతేరాస్, దీపావళి సందర్భంగా వినియోగదారులకు బంగారం కొనుగోలుపై అందిస్తున్న సూపర్ ఆఫర్లుగా ఉన్నాయి.