రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్
ట్రాయ్ నిబంధనలకు అనుగుణంగా జియో రూ.1,748 రీఛార్జ్ ప్యాకేజీని ప్రారంభించింది. ఈ ప్యాకేజీ అందించే 336 రోజుల వ్యాలిడిటీతో, వినియోగదారులు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ఎంపికతో వినియోగదారులు 11 నెలలకు పైగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
అపరిమిత కాల్స్‌తో పాటు, జియో ప్యాకేజీలో 3,600 ఉచిత SMSలు ఉన్నాయి. అదనంగా, జియో టీవీ, జియో క్లౌడ్ సభ్యత్వాలు ఉచితం, ఓవర్-ది-టాప్ స్ట్రీమింగ్ కోసం జియో సినిమాకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది.