ఈ ఒక్క పథకంతో మీ కూతురి భవిష్యత్ మారిపోతుంది!

Published : Jan 27, 2025, 03:23 PM IST

పిల్లల చదువు, ఆరోగ్యం, ఉద్యోగం, పెళ్లి ఖర్చుల గురించి తల్లిదండ్రులు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. అందులోనూ ఆడపిల్లలు కలిగిన పేరెంట్స్ ఇంకా ఎక్కువ ఆందోళన చెందుతుంటారు. అయితే ఈ ఒక్క పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా.. మీ కూతురి భవిష్యత్ ను అందంగా మార్చుకోవచ్చు.

PREV
14
ఈ ఒక్క పథకంతో మీ కూతురి భవిష్యత్ మారిపోతుంది!

ఆడపిల్ల పుట్టగానే ఆమె చదువు, ఆరోగ్యం, ఉద్యోగం,పెళ్లి గురించి తల్లిదండ్రులకు ఆందోళనలు మొదలవుతాయి. అలాంటి బాధలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.

24
అధిక వడ్డీ

పదేళ్లలోపు ఆడపిల్లల పేరిట సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయెచ్చు. ఇతర బ్యాంకు ఫిక్సుడ్ డిపాజిట్లతో పోలిస్తే ఈ పథకంలో అధిక వడ్డీరేటు దక్కుతుంది.

34
ఇందులో పెట్టుబడి..

సాధారణంగా మధ్యతరగతి తల్లిదండ్రులు పిల్లల ప్రతి దశలోనూ ఆందోళన చెందుతుంటారు. అందుకే వారు తమ పిల్లల చదువుల కోసం చిన్నప్పటి నుంచే డబ్బు దాస్తుంటారు. అలాంటి వారు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.

44
ఎన్నేళ్లు కట్టాలి?

సుకన్య సమృద్ధి యోజన పథకంలో మన పెట్టుబడిని బట్టి రిటర్న్స్ ఉంటాయి. ఈ పథకంలో సంవత్సరానికి  250 రూపాయల నుంచి లక్షా 50 వేల వరకు ఎంతైనా కట్టుకోవచ్చు. ఇలా 15 ఏళ్లు కట్టాలి. అకౌంట్ ఓపెన్ చేసిన 21 ఏళ్లకు మెచ్యూరిటీ వస్తుంది.

click me!

Recommended Stories