Gold Price Hike: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మరోసారి షాక్ తగిలింది. గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన గోల్డ్ రేట్లు...ఈరోజు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలుదారుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది.
ఈ వారం ప్రారంభంలోనే బంగారం ధరలు వరుసగా పెరిగాయి. గురువారం, శుక్రవారం కొంత తగ్గడంతో ఇక ధరలు మరింత దిగొస్తాయని చాలా మంది భావించారు. కానీ శనివారం మార్కెట్ ఓ సడెన్ ట్విస్ట్ ఇచ్చింది. రెండు రోజుల తగ్గుదలకు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,930గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే రూ.600 పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850గా ఉండగా... ఇది కూడా రూ.550 పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక వెండి విషయానికి వస్తే... అంతర్జాతీయ మార్కెట్ కదలికలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. స్థానిక మార్కెట్‌ను బట్టి వెండి ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండొచ్చు.
24
మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్న ప్రపంచ పరిణామాలు
అమెరికాలో ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి బంగారం మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందనే అంచనాలు వస్తే... పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో గోల్డ్‌కు డిమాండ్ పెరిగి ధరలు కూడా పెరుగుతాయి. అమెరికా డాలర్ విలువలో ప్రతి చిన్న మార్పు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుంది. డాలర్ బలహీనపడితే అంతర్జాతీయ పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి కొనుగోలు చేస్తారు. ఫలితంగా ధరలు పైకి వెళ్తాయి.
34
గమనిస్తున్న మార్కెట్లు
ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ పరిస్థితులు లేదా భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే... పెట్టుబడిదారులు షేర్ మార్కెట్ లాంటి రిస్కీ ఆస్తుల నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడులు పెడతారు. అయితే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పూర్తిస్థాయి యుద్ధంగా మారిన పరిస్థితి లేదు. అయినప్పటికీ మధ్యప్రాచ్య ప్రాంతంలో పరిస్థితులపై మార్కెట్లు అప్రమత్తంగా ఉన్నాయి. ఎలాంటి ప్రతికూల పరిణామం జరిగినా... బంగారంపై డిమాండ్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఉద్రిక్తతలు పెరిగితే బంగారం ధరలు మరింత ఎగిసే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు తగ్గితే ధరలు కాస్త శాంతించే అవకాశం ఉంది.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్, మధ్యప్రాచ్య పరిణామాలు, తర్జాతీయ స్పాట్ గోల్డ్ ధరలు, ఈ నాలుగు అంశాలే బంగారం ధరలకు కీలకంగా మారనున్నాయి. ఈ పరిణామాలను బట్టి గోల్డ్ ధరలు మరోసారి పెరిగే అవకాశమూ ఉంది... లేక కొంత మేర తగ్గే అవకాశమూ ఉంది. అందుకే బంగారం కొనుగోలు చేసే వారు రోజువారీ ధరలను తప్పకుండా గమనించడం మంచిది.