Business Ideas : చేతిలో కేవల రూ.50,000 ఉంటే చాలు.. మంచి లాభాలతో కూడిన ఈ 5 బిజినెస్ చేయవచ్చు

Published : Jul 25, 2026, 12:57 PM IST

తక్కువ పెట్టుబడితో  మంచి లాభాలు వచ్చే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే కేవలం రూ.50000 తో కూడా ప్రారంభించే బిజినెస్ లు కూడా ఉన్నాయి.  ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం అందించే 5 అద్భుతమైన బిజినెస్ ఐడియాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

PREV
16
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు தரும் தொழில்கள்

చేతిలో కేవలం రూ.50,000 ఉన్నా చాలు.. సరైన ప్లానింగ్ తో పెట్టుబడి పెట్టే తెలివి, కష్టపడే తత్వం ఉంటే లాభదాయకమైన వ్యాపారాలను ప్రారంభించవచ్చు. ముఖ్యంగా మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉండే వ్యాపారాలను ఎంచుకుంటే, తక్కువ సమయంలోనే మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. అలాంటి 5 ఉత్తమ బిజినెస్ ల గురించి వివరంగా చూద్దాం.

26
1. ఇంటి నుంచే ఫుడ్ బిజినెస్ (Home Food Business)

ఇప్పటి బిజీ లైఫ్‌స్టైల్‌లో ఇంట్లో వండిన శుభ్రమైన భోజనానికి చాలా డిమాండ్ ఉంది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, ఒంటరిగా నివసించే వారికి రోజూ భోజనం అందించే బిజినెస్ ను తక్కువ ఖర్చులోనే ప్రారంభించవచ్చు. 

ప్రారంభ పెట్టుబడి

• వంట పాత్రలు – రూ.10,000

• కిరాణా సరుకులు – రూ.15,000

• ప్యాకింగ్ మెటీరియల్స్ – రూ.10,000

• డెలివరీ, ప్రచారం – రూ.15,000

ఆదాయం

రోజుకు 30–50 మందికి భోజనం అందించినా చాలు… నెలకు రూ.30,000 నుండి రూ.80,000 వరకు సంపాదించవచ్చు. ఖర్చులు పోను రూ.30,000 వరకు లాభం పొందవచ్చు. 

ప్రత్యేకతలు

• ఇంటి నుంచే నడపవచ్చు.

• మహిళలకు, కుటుంబ వ్యాపారంగా అనుకూలం.

• సోషల్ మీడియా ద్వారా సులభంగా కస్టమర్లను సంపాదించుకోవచ్చు.

36
2. మొబైల్ యాక్సెసరీస్ అమ్మకం

స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరుగుతున్న కొద్దీ మొబైల్ కవర్లు, ఛార్జర్లు, ఇయర్‌ఫోన్లు, టెంపర్డ్ గ్లాస్, పవర్ బ్యాంక్ వంటి వస్తువులకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. వీటిని అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. 

ప్రారంభ పెట్టుబడి

• ప్రారంభ స్టాక్ – రూ.35,000

• షెల్ఫ్, డిస్‌ప్లే – రూ.10,000

• ప్రచారం – రూ.5,000

ఆదాయం:

చాలా మొబైల్ యాక్సెసరీస్ పై సగటున 25%–50% వరకు లాభం ఉంటుంది. అమ్మకాలు బాగుంటే నెలకు రూ.25,000–రూ.60,000 వరకు ఆదాయం పొందవచ్చు.

ప్రత్యేకతలు:

• వస్తువులు వేగంగా అమ్ముడవుతాయి.

• ఆన్‌లైన్‌లో కూడా అమ్మవచ్చు.

• చిన్న స్థలం సరిపోతుంది.

46
3. డిజిటల్ ప్రింటింగ్ & జిరాక్స్ సెంటర్

స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల దగ్గర ఈ వ్యాపారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. 

ప్రారంభ పెట్టుబడి:

• ప్రింటర్ – రూ.20,000

• కంప్యూటర్ (పాతది కొనవచ్చు) – రూ.20,000

• పేపర్, ఇంక్ – రూ.10,000

అందించే సేవలు:

• జిరాక్స్

• కలర్ ప్రింట్

• లామినేషన్

• స్పైరల్ బైండింగ్

• ఆన్‌లైన్ అప్లికేషన్ల రిజిస్ట్రేషన్

ఆదాయం 

నెలకు రూ.30,000–రూ.70,000 వరకు సంపాదించే అవకాశం ఉంది.

ప్రత్యేకతలు:

• ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

• అదనపు సేవలతో ఆదాయాన్ని పెంచుకోవచ్చు.

56
4. సహజ ఆహార ఉత్పత్తుల అమ్మకం

ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం వైపు మొగ్గు చూపుతుండటంతో, సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు మంచి మార్కెట్ ఏర్పడింది. పాతకాలంలో ప్రజలు వాడిన అహారపదార్థాలు తినేందుకు ఈతరం ఆసక్తి చూపుతోంది.ఇలాంటి అహారం అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.

అమ్మే వస్తువులు

• సజ్జ పిండి

• రాగి పిండి

• పసుపు

• కారం పొడి

• ఆర్గానిక్ బెల్లం

• కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్

ప్రారంభ పెట్టుబడి

• వస్తువుల కొనుగోలు – రూ.35,000

• ప్యాకింగ్ – రూ.10,000

• బ్రాండింగ్ – రూ.5,000

ఆదాయం:

నెలకు రూ.25,000–రూ.75,000 వరకు సంపాదించవచ్చు.

ప్రత్యేకతలు:

• ఆన్‌లైన్ ఆర్డర్లు పెరుగుతున్నాయి.

• కస్టమర్లు మళ్లీ మళ్లీ కొనే అవకాశం ఎక్కువ.

66
5. సోషల్ మీడియా మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (Social Media Management)

Instagram, Facebook, YouTube వంటి ప్లాట్‌ఫామ్‌లలో చిన్న వ్యాపారాల పేజీలను నిర్వహించే సేవను అందించవచ్చు. మీకు కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు… ఈజీగా ఈ బిజినెస్ చేయవచ్చు.

అందించే సేవలు

• రోజువారీ పోస్టులు

• రీల్స్ క్రియేషన్

• పోస్టర్ డిజైన్

• అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్స్

• YouTube థంబ్‌నెయిల్ డిజైన్

ప్రారంభ పెట్టుబడి

• ల్యాప్‌టాప్ ఉంటే అదనపు పెట్టుబడి తగ్గుతుంది. సాఫ్ట్‌వేర్, ఇంటర్నెట్, ప్రచారం కోసం సుమారు రూ.20,000–రూ.50,000 సరిపోతుంది.

ఆదాయం

ఒక క్లయింట్ నుండి నెలకు రూ.5,000–రూ.20,000 వరకు సర్వీస్ ఛార్జ్ తీసుకోవచ్చు. 5–10 మంది క్లయింట్లు దొరికితే నెల ఆదాయం రూ.50,000 దాటే అవకాశం ఉంది.

ప్రత్యేకతలు:

• ఇంటి నుంచే పని చేయవచ్చు.

• పెట్టుబడి చాలా తక్కువ.

• నైపుణ్యం పెరిగేకొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది. 

గమనిక : రూ.50,000 చిన్నపెట్టుబడే అయినా, సరైన వ్యాపారాన్ని ఎంచుకుంటే అది పెద్ద ఆదాయానికి పునాది అవుతుంది. మీ నైపుణ్యం, మార్కెట్ డిమాండ్, ఆసక్తికి తగిన వ్యాపారాన్ని ఎంచుకుని, చిన్నగా ప్రారంభించి క్రమంగా విస్తరించడం విజయానికి ఉత్తమ మార్గం.

"చిన్న పెట్టుబడి + సరైన ప్రణాళిక + నిరంతర కృషి = విజయవంతమైన వ్యాపారం" అనేది ఈ 5 వ్యాపారాలకు వర్తించే ముఖ్యమైన సూత్రం.

Read more Photos on
click me!

Recommended Stories