Jio, Airtel Flood Relief: వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులకు ఊరట ఇచ్చేలా జియో, ఎయిర్‌టెల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులకు ఉచిత డాటా, కాలింగ్ సర్వీసులు అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి, దీంతో అనేక జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాళా తదితర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, చెరువులు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి, జన జీవనం స్థంభించింది. ఈ తరుణంలో జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి తమ వినియోగదారులకు మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంతకీ ఆ నిర్ణయమేంటీ?
26
జియో, ఎయిర్‌టెల్ కీలక నిర్ణయం
వరద ప్రభావిత ప్రాంతాల్లోని వినియోగదారులకు ఊరట ఇచ్చేలా జియో, ఎయిర్‌టెల్ లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. వినియోగదారులకు ఉచిత డాటా, కాలింగ్ సర్వీసులు అందించేందుకు జియో, ఎయిర్‌టెల్ ముందుకొచ్చాయి. సహాయక చర్యల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సర్వీసులు ఉచితంగా అందుబాటులో ఉంటాయి.
36
జియో ప్రకటన
భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లోని రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకు తాత్కాలిక సాయం ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని ప్రీపెయిడ్ ప్లాన్‌ల వ్యాలిడిటీని 3 రోజుల పాటు ఆటోమేటిక్‌గా పొడిగిస్తామని జియో అధికారులు తెలిపారు. దీనివల్ల, వినియోగదారులు తక్షణ రీఛార్జ్ అవసరం లేకుండా నిరంతరంగా నెట్‌వర్క్ సేవలను ఉపయోగించగలుగుతారు.
ప్రీపెయిడ్ వినియోగదారులకు రోజుకు 2GB హై-స్పీడ్ డేటా, అన్ని కాల్స్ ఉచితంగా లభిస్తాయని జియో పేర్కొంది. వీటితో వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఇంటర్నెట్ బ్రౌజింగ్, వాయిస్ కాల్స్, మాస్‌జింగ్, ఇతర డిజిటల్ అవసరాలను కొనసాగించవచ్చు. ఈ నిర్ణయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో వినియోగదారులు ఎలాంటి కనెక్టివిటీ సమస్యలు లేకుండా తమ మొబైల్ & డేటా సేవలను ఉపయోగించగలుగుతారు.
ఎయిర్ టెల్ కూడా కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక సహాయక చర్యలను ప్రకటించింది. ఈ చర్యల ప్రకారం ప్రీపెయిడ్ కస్టమర్ల ప్లాన్ల వ్యాలిడిటీని 3 రోజుల పాటు ఆటోమేటిక్‌గా పొడిగించబడుతుంది. ఈ చర్య ద్వారా తక్షణ రీఛార్జ్ అవసరం లేకుండా సేవలను కొనసాగించగలుగుతారు.
ప్రీపెయిడ్ వినియోగదారులకు అపరిమిత కాలింగ్, రోజుకు 1GB హై-స్పీడ్ డేటా కూడా అందించబడుతుంది. వీటితో, ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా, మాసేజింగ్, వాయిస్ కాలింగ్ వంటి సేవలను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా సజావుగా ఉపయోగించవచ్చు. అలాగే, పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు తమ బిల్లులను చెల్లించడానికి 3 రోజుల అదనపు సమయం (Grace Period) పొందుతారు. ఇది, ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో బిల్లులు చెల్లించలేకపోయే వినియోగదారులకు సౌకర్యంగా ఉంటుంది.
56
కేంద్రం సూచన – ఇంట్రా సర్కిల్ రోమింగ్ యాక్టివేషన్
జమ్మూ కాశ్మీర్, లడఖ్ , హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో వినియోగదారుల కనెక్టివిటీని ప్రభావితం కాకుండా కొనసాగించేందుకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. అన్ని టెలికాం సంస్థలు ICR (Inter Circle Roaming)సేవలను సెప్టెంబర్ 2 వరకు యాక్టివ్‌గా ఉంచాలని ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులు తమ ప్రాథమిక టెలికాం ప్రొవైడర్ ద్వారా సర్వీస్ అందని సందర్భంలో కూడా మరొక సంస్థ నెట్‌వర్క్ సేవలను సజావుగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా వరదల కారణంగా అనేక ప్రాంతాల్లో సిగ్నల్, కనెక్టివిటీ సమస్యలు ఎదురవుతున్న సందర్భంలో ఈ చర్య వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా అత్యవసర కాల్స్, డేటా, కమ్యూనికేషన్ సేవలను అందించడంలో సహాయపడుతుంది.
66
ప్రధాన ఉద్దేశమిదే..
కేంద్ర ప్రభుత్వం, టెలికాం నిర్ణయం ద్వారా వినియోగదారులు అంతరాయం లేకుండా కనెక్టివిటీ పొందగలుగుతారు. అత్యవసర కాల్స్ చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ప్రజలకు తక్షణ సమాచార మార్పిడి సౌకర్యం అందించబడుతుంది. ఉచిత డేటా, కాలింగ్, బిల్లు వాయిదా వంటి ప్రయోజనాలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో నివాసుల భారం తగ్గించేందుకు సహాయపడతాయి.