Jeff Bezos: ఏఐ రేస్‌లోకి అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు బెజోస్‌.. రూ. 51 వేల కోట్ల‌తో కొత్త స్టార్ట‌ప్ కంపెనీ

Published : Nov 18, 2025, 03:40 PM IST

Jeff Bezos: అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెబోస్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఏఐ రంగంలోకి అడుగు పెట్టారు. ఇందులో భాగంగానే ప్రాజెక్ట్ ప్రోమిథియ‌స్ అనే ఏఐ స్టార్ట‌ప్‌ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు. 

PREV
15
తిరిగి CEOగా బెజోస్

అమెజాన్‌ మాజీ అధినేత జెఫ్ బెజోస్ మరోసారి CEO పదవిలోకి వచ్చారు. నాలుగేళ్ల క్రితం అమెజాన్‌ నుంచి తప్పుకున్న ఆయన, ఇప్పుడు “ప్రాజెక్ట్ ప్రోమిథియస్” అనే కొత్త కృత్రిమ మేధస్సు (AI) స్టార్టప్‌కు తనే CEOగా నియ‌మితులైన‌ట్లు సమాచారం. ఈ స్టార్టప్‌ను ఆయనతో కలిసి విక్ బజాజ్ అనే టెక్ నిపుణుడు సహ-సీఈఓగా నడపుతున్నారు.

25
ఇంజినీరింగ్, తయారీ రంగాలకు ప్రత్యేక AI టెక్నాలజీ

ఇంజినీరింగ్‌, తయారీ రంగాల్లో ఉపయోగపడే అధునాతన AI టెక్నాల‌జీని అందించ‌డ‌మే ప్రాజెక్ట్ ప్రోమిథియస్ స్టార్ట‌ప్ ప్రధాన లక్ష్యం. ఈ కంపెనీ ఇప్పటికే $6.2 బిలియన్ (రూ. 51,000 కోట్లకు పైగా) భారీ పెట్టుబడులు సమీకరించింది. ఇక ఈ కంపెనీ మ‌రో సీఈఓగా వ్య‌వ‌హ‌రిస్తున్న విక్ బజాజ్ గూగుల్‌ X (మూన్‌షాట్ ఫ్యాక్టరీ)లో పనిచేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త. ఆ సంస్థలో “వెరిలీ” అనే హెల్త్ స్టార్టప్‌ను ఆయన స్థాపించారు.

35
ఓపెన్ఏఐ, డీప్‌మైండ్‌, మెటా నుంచి..

ఈ కంపెనీ ఇప్ప‌టికే 100 మందికి పైగా ఇంజినీర్లను నియమించుకుంది. వీరిలో చాలామందిని OpenAI, DeepMind, Meta వంటి ప్రముఖ AI సంస్థల నుంచి తీసుకున్నారు. కంపెనీ ఎక్కడ నుంచి పనిచేస్తుంది? టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? అనే విషయాలపై మాత్రం ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.

45
అమెజాన్‌ తర్వాత బెజోస్‌కు ఇదే పెద్ద ప‌ద‌వి

అమెజాన్‌కు దూరమైన తర్వాత బెజోస్ “బ్లూ ఆరిజిన్” అనే అంతరిక్ష సంస్థలో మాత్రమే కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ CEO హోదాలో ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. ప్రాజెక్ట్ ప్రోమిథియస్ AI రంగంలో ఉన్న OpenAI వంటి దిగ్గజాలకు ప్రత్యర్థిగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

55
AI పరిశ్రమపై ఆర్థిక సందేహాలు

AI మార్కెట్‌లో బిలియన్ల పెట్టుబడులు వస్తున్నా, కొంత‌మంది ఆర్థిక విశ్లేషకులు దీని భవిష్యత్‌పై ప్రశ్నిస్తున్నారు. 2008 హౌసింగ్‌ సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసిన ప్రసిద్ధ పెట్టుబడిదారుడు మైకేల్ బరీ, ఇటీవలే $1 బిలియన్ పెట్టుబడి పెట్టి పాలంటీర్, ఎన్వీడియా షేర్లు పడిపోతాయని బెట్టింగ్ చేశారు. కొన్ని టెక్ కంపెనీలు లాభాలను కృత్రిమంగా పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు.

Read more Photos on
click me!

Recommended Stories