ఐఫోన్ 17 ఫోన్లు అమ్మకానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అనేక దేశాల్లో దీని అమ్మకాలు జరుగుతున్నాయి. మనదేశంలో ఈ రోజు నుంచి (సెప్టెంబరు 19) ఐఫోన్ 17 అమ్మకాలు మొదలవుతాయి. యాపిల్ స్టోర్, రిటైల్ షాపులు, ఇ-కామర్స్ ద్వారా కొనొచ్చు. ఐఫోన్ 17, ప్రో, ప్రో మ్యాక్స్, ఎయిర్ మోడల్స్ లభిస్తాయి.