Amazon: లేట్ చేస్తే అమెజాన్ బంపర్ ఆఫర్ మిస్సైపోతారు: ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్స్

Published : Jun 02, 2025, 10:34 PM IST

అమెజాన్‌ తన కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్ ను తీసుకొచ్చింది. ఐఫోన్ 15-256 GB మోడల్ ను ఇప్పటివరకు ఎవరూ తగ్గించనంత తక్కువ ధరకు అందిస్తోంది. అమెజాన్‌లో భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ఈ ఫోన్‌ను మీరు సొంతం చేసుకోవచ్చు. దీని ధర, ఫీచర్లు ఓసారి చూద్దాం.  

PREV
15
ఐఫోన్ అభిమానులకు జాక్‌పాట్

ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో ఐఫోన్‌లు ఎల్లప్పుడూ ముందుంటాయి. ఆండ్రాయిడ్ ఫోన్ల కంటే ఇవి చాలా ఖరీదైనవి అయినప్పటికీ చాలా మంది వ్యక్తులు ఆఫర్‌ల కోసం వెయిట్ చేసి వీటిని కొంటారు. మీరు కూడా ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు మీకు అద్భుతమైన అవకాశం లభించింది. ఐఫోన్ 15ను భారీ తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అద్భుతమైన అవకాశం ఉంది. 

25
ఐఫోన్ 15పై అమెజాన్ బంపర్ ఆఫర్

ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి అమెజాన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ ఐఫోన్ 15 ధరను మళ్లీ తగ్గించింది. ఇప్పుడు మీరు ఐఫోన్ 15ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంటే మీరు భారీ మొత్తాన్ని ఆదా చేసుకోవచ్చు. 2023లో ఆపిల్ విడుదల చేసిన ఈ మోడల్ అద్భుతమైన కెమెరా, శక్తివంతమైన చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది అద్భుతమైన ఫోటోలను కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్‌లను ఇప్పుడు తెలుసుకుందాం. 

35
ఐఫోన్ 15 తగ్గింపు ఆఫర్

ప్రస్తుతం 256GB స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 15 అమెజాన్‌లో రూ.70,900కి అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రత్యేకంగా 13% తగ్గింపును అందిస్తోంది. దీని ద్వారా మీరు దీన్ని రూ.69,500కి కొనుగోలు చేయవచ్చు. అంటే సుమారు రూ.10,000 కంటే ఎక్కువ ఆదా అవుతుంది. అదనంగా మీరు బ్యాంక్ ఆఫర్‌లను ఉపయోగిస్తే మీరు ఇంకా తక్కువ చెల్లించొచ్చు. 

45
ఎక్స్ఛేంజ్ ఆఫర్

అంతేకాకుండా ఐఫోన్ 15పై అమెజాన్ ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. మీ వద్ద పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే మీరు దానిని రూ.62,700 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ విలువ మీ పాత ఫోన్ పనితీరుపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించడం ద్వారా మీరు ధరను రూ.25,000 కంటే తక్కువకు తగ్గించవచ్చు.

55
ఐఫోన్ 15 ఫీచర్లు ఇవే..

ఐఫోన్ 15 అల్యూమినియం ఫ్రేమ్‌లో అమర్చిన అందమైన గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇది డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డోల్బీ విజన్ సపోర్ట్‌తో కూడిన వైబ్రెంట్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. అదనంగా దీనికి సెరామిక్ షీల్డ్ గ్లాస్ రక్షణగా ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories