రోజూ రూ. 45 పెట్టుబడితో రూ. 25 లక్షలు మీ సొంతం

First Published Oct 17, 2024, 5:58 PM IST

invest Rs 45 daily and will get 25 lakhs: ప్రతిరోజూ రూ. 45 పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 25 లక్షల పెద్ద ఫండ్‌ను సృష్టించవ‌చ్చు. దీంతో పాటు మీకు అనేక ప్ర‌యోజ‌నాలు అందించే సూప‌ర్ స్కీమ్ ను ఎల్ఐసీ తీసుకువ‌చ్చింది. ఆ వివ‌రాలు మీకోసం.
 

lic pension plan 4

LIC Jeevan Anand Policy: ప్రతి ఒక్కరి జీవితంలో ఆర్థిక‌ పొదుపు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌ని ఈ జీవితంలో మీకు ఎప్పుడైనా అకస్మాత్తుగా డబ్బు అవసరం కావ‌చ్చు. అందుకే మీకు మంచి మొత్తంలో పొదుపు ఉంటే ఆర్థిక ఇబ్బందులు వ‌చ్చినా, పెద్ద మొత్తంలో డ‌బ్బు అవ‌స‌రం ప‌డినా కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

ప్రతి వ్యక్తి తన పొదుపును సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని కోరుకుంటాడు. దీంతో పాటు దాని నుంచి మంచి రాబ‌డి రావాల‌ని కోరుకుంటాడు. అలాంటి ఒక అద్భుత‌మైన స్కీమ్ ను తీసుకువ‌చ్చింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ). దీని ద్వారా మీరు ప్ర‌తిరోజూ కేవ‌లం 45 రూపాయ‌ల పెట్టుబ‌డితో 25 ల‌క్ష‌ల వ‌ర‌కు ఫండ్ ను పొంద‌వ‌చ్చు.

lic pension plan 1.jpg

రోజూ రూ. 45 పెట్టుబడితో రూ. 25 లక్షలను అందించే ఎల్ఐసీ జీవ‌న్ ఆనంద్ స్కీమ్ 

మంచి పొదుపుతో పాటు మంచి రాబ‌డిని అందించే విష‌యంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఒక అద్భుతమైన ఎంపిక. దీని కోసం ఎల్ఐసీ అనేక ర‌కాల స్కీమ్ ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఎల్ఐసీ అన్ని వయసుల వారి కోసం వివిధ ర‌కాల ప్లాన్ల‌ను అందుబాటులోకి తీస‌కువ‌చ్చింది. ఆయా వాటిలో మీరు చిన్న మొత్తాలను పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా భారీ ఫండ్‌ను కూడబెట్టుకోవచ్చు. అటువంటి పథకం ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ. దీనిలో మీరు రోజుకు కేవలం రూ. 45 ఆదా చేయడం ద్వారా రూ. 25 లక్షలు పొందవచ్చు.

Latest Videos


మీరు తక్కువ ప్రీమియంతో మంచి ఫండ్‌ని సేకరించాలనుకుంటే, జీవన్ ఆనంద్ పాలసీ మీకు గొప్ప ఎంపిక. ఈ ప్లాన్ టర్మ్ ప్లాన్ మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ మీరు మీ పాలసీ వ్యవధిలో ప్రీమియం చెల్లించాలి. ఈ పథకంలో పాలసీదారుడు ఒకటి కంటే ఎక్కువ మెచ్యూరిటీ ప్రయోజనాలను పొందుతాడు. ఎల్ఐసీ అందిస్తున్న ఈ పథకంలో కనీస హామీ మొత్తం రూ. 1 లక్ష, అయితే గరిష్ట పరిమితి ఏదీ సెట్ చేయ‌లేదు. అంటే మీరు పొదుపు చేసే దానిని బ‌ట్టి మీరు అందుకునే ఫండ్ పెరుగుతుంది. 
 

రూ.45 నుంచి రూ.25 లక్షల నిధిని ఎలా పొందుతారు? 

ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీ కింద మీరు నెలకు సుమారుగా రూ. 1358 పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 25 లక్షల కార్పస్‌ను కూడబెట్టుకోవచ్చు. అంటే రోజుకు చూసుకుంటే రూ.45 మాత్రమే పెట్టుబ‌డి పెడితే మీకు భారీ ఫండ్ అందుతుంది. అయితే, మీరు ఈ పొదుపును కొంత ఎక్కువ స‌మ‌యం చేయాల్సి వుంటుంది. ఈ పథకంలో మీరు రోజూ రూ. 45ల సెవింగ్స్ చేస్తూ 35 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో మీరు రూ. 25 లక్షల మొత్తాన్ని పొందుతారు.

జీవ‌న్ ఆనంద్ పాల‌సీతో ఇంకా చాలానే ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి 

ఎల్‌ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో 35 ఏళ్లపాటు ప్రతి సంవత్సరం రూ.16,300 ఇన్వెస్ట్ చేస్తే మొత్తం డిపాజిట్ మొత్తం రూ.5,70,500 అవుతుంది. ఈ పాలసీ ప్రకారం మీ ప్రాథమిక హామీ మొత్తం రూ. 5 లక్షలు. మెచ్యూరిటీ వ్యవధి తర్వాత రూ. 8.60 లక్షలు రివిజనరీ బోనస్‌గా, రూ. 11.50 లక్షలు తుది బోనస్‌గా అందుకుంట‌లారు. ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో బోనస్ రెండుసార్లు అందిస్తారు. అయితే దీని కోసం మీ పాలసీ వ్యవధి తప్పనిసరిగా 15 సంవత్సరాలు ఉండాలి.

జీవన్ ఆనంద్ పాలసీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయా? 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అందిస్తున్న జీవన్ ఆనంద్ పాలసీ పాలసీదారు ఈ పథకం కింద ఎలాంటి పన్ను మినహాయింపు పొందరు. అయితే, దాని ప్రయోజనాలు నాలుగు రకాల రైడర్‌లను కలిగి ఉంటాయి: యాక్సిడెంటల్ డెత్, డిసేబిలిటీ రైడర్, యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్, న్యూ టర్మ్ ఇన్సూరెన్స్ రైడర్, న్యూ క్రిటికల్ బెనిఫిట్ రైడర్.

ఈ పాలసీలో డెత్ బెనిఫిట్ సదుపాయం అందిస్తారు. అంటే ఏదైనా కారణం వల్ల పాలసీదారు మరణిస్తే, నామినీ పాలసీ డెత్ బెనిఫిట్‌లో 125 శాతం అందుకుంటారు. పాలసీ మెచ్యూర్ కావడానికి ముందే పాలసీదారు మరణిస్తే, నామినీకి హామీ ఇచ్చిన సమయానికి సమానమైన మొత్తం అందుకుంటారు.

click me!