మీరు ఈ పనులు చేశారంటే మీకు income tax నోటీసులు తప్పవు

First Published Oct 17, 2024, 1:54 PM IST

ఈ మధ్య డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంకుకు వెళ్లక్కర లేకుండా, కూర్చున్న చోటే కదలకుండా సింపుల్ గా డబ్బులు పంపేయొచ్చు. కావాలంటే తీసుకోవచ్చు.. ఇదే బాగుంది కదా అని భారీ మొత్తంలో డబ్బు పంపినా.. తీసుకున్నా మీరు ఆదాయపు పన్ను శాఖకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది తెలుసా? ఎలాంటి లావాదేవీలు చేస్తే ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ నోటీసులు పంపుతుందో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. 
 

డిజిటల్ లావాదేవీల ద్వారా పెద్ద మొత్తాలను పంపినా, తీసుకున్నా మీరు  ఆదాయపు పన్ను నోటీసులు అందుకుంటారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే ఇన్ కమ్ టాక్స్ శాఖకు సమాచారం వెళుతుంది. ఈ డబ్బు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో జమ చేసినా అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వస్తుంది. దీంతో డిపాజిట్ చేసిన డబ్బు ఎక్కడిదని ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు.
 

ఫిక్స్‌డ్ డిపాజిట్లు

ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో ఒక బ్యాంకు అకౌంట్ లో రూ. 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు జరిగితే ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని కలిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో డిపాజిట్లు రూ. 10 లక్షలు దాటినా కూడా ఆ అమౌంట్ వివరాలు కోరుతూ ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేయవచ్చు. 
 

Latest Videos


ఆస్తి లావాదేవీలు

ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు రూ.30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి రిజిస్ట్రార్ కార్యాలయం నుండి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం పంపాలి. అటువంటి పరిస్థితిలో ఇంత పెద్ద లావాదేవీని నిర్వహించడానికి డబ్బు ఎక్కడ నుండి వచ్చింది అని ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు పంపే అవకాశం ఉంటుంది. 
 

క్రెడిట్ కార్డ్ బిల్లు

ఈ కాలంలో చాలా మంది క్రెడిట్ కార్డ్ లపైనే ఆధారపడి కుటుంబాలను పోషిస్తున్నారు. వచ్చిన జీతం అంతా ఈఎంఐలు కట్టుకోవడానికి సరిపోవడవంతో నెల మొత్తం ఇల్లు గడపడానికి క్రెడిట్ కార్డులనే వాడుతున్నారు. ఈ నేపథ్యంలో బిల్లులు రూ. లక్ష లేదా అంతకంటే ఎక్కువ వస్తే మీరు ఆదాయపు పన్ను శాఖకు సమాధానం చెప్పాల్సింది ఉంటుంది. ఆ బిల్లలు కూడా మీరు నగదు రూపంలో చెల్లిస్తే ఈ ట్రాన్సాక్షన్ ఆదాయపు పన్ను శాఖ లూప్ కిందకు రావచ్చు. దీంతో మీరు కచ్చితంగా ఆ డబ్బు మూలాన్ని చెప్పాల్సి ఉంటుంది. మీరు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును చెల్లిస్తే డబ్బు ఎక్కడి నుండి వచ్చిందన్న విషయంపై నోటీసు వస్తుంది.
 

షేర్లు, బాండ్లను కొనుగోలు చేయడం

షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ల కొనుగోలుకు పెద్ద మొత్తంలో డబ్బును ఉపయోగిస్తే వెరిఫికేషన్ కోసం ఆదాయపు పన్ను శాఖకు సమాచారం వెళ్తుంది. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక శ్రద్ధతో దర్యాప్తు చేస్తుంది. ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆదాయపు పన్ను శాఖ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.
 

click me!