బంగారంపై పెట్టుబడి
రాబోయే నెలల్లో మెటల్ గోల్డ్ కొనుగోళ్లకు డిమాండ్ పెరగనుందని, ముఖ్యంగా ETF డిమాండ్ వేగవంతం అవుతోందని UBS అభిప్రాయపడింది. అయితే చైనాలో మాత్రం బంగారం డిమాండ్ తగ్గుతున్నట్లు సంకేతాలు ఉన్నాయి. యూఎస్బీ బ్యాంకు బంగారం పెట్టుబడిపై 5 శాతం కేటాయింపును సిఫార్సు చేస్తోంది. విభిన్నమైన US డాలర్-డినామినేటెడ్ పోర్ట్‌ఫోలియోలో బంగారాన్ని మూలాధార హెడ్జ్‌గా బ్యాంక్ సిఫార్సు చేస్తూ కొనుగోలుదారులను ఎంకరేజ్ చేస్తోంది.
2025లో ఆల్ టైమ్ హై రేటు
UBS గోల్డ్ మైనర్లను ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశంగా చెబుతోంది. 2025 ప్రారంభంలో బంగారం ఆల్ టైమ్ ఎక్కువ ధరను నమోదు చేస్తుందని చెబుతోంది. వివిధ దేశాల కరెన్సీలో హెచ్చుతగ్గులు ఓ కారణం కాగా, టర్కీ, సింగపూర్, బ్రెజిల్, భారతదేశం వంటి దేశాలు కూడా తమ నిల్వలను పెంచుకోవడం కారణమని వెల్లడించింది. 2025 ప్రారంభంలో బంగారం ధరలు ఆల్ టైమ్ హైకి చేరుకుంటాయని డెవెరెక్స్ గ్రూప్ సీఈవో చెప్పారు.