Insurance Scheme: ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. ఇలాంటి పథకాల్లో ఒకటి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ఒకటి. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ భీమా రక్షణ అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్య పథకాలలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన ఒకటి. కరోనా తర్వాత భీమా అవసరం పెరగడంతో ఈ పథకానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. రోజుకు కేవలం రెండు రూపాయలతో ఏకంగా రూ.2 లక్షల ఇన్సూరెన్స్ పొందొచ్చు.
25
ఈ పథకానికి ఎవరు అర్హులు.?
భారత పౌరులైన 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ భీమాకు అర్హులు. బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఉండటమే ప్రధాన అర్హత. ఎల్‌ఐసీతో పాటు ప్రభుత్వ అనుమతితో పనిచేసే అన్ని బ్యాంకులు ఈ పాలసీని అందిస్తున్నాయి. పోస్టాఫీసు ద్వారా కూడా దరఖాస్తు చేసే అవకాశముంది.
35
ప్రీమియం ఎంత? ఎలా పనిచేస్తుంది?
ఈ పథకం సంవత్సరానికి రూ.436 ఫీజుతో అందుబాటులో ఉంటుంది. మీరు ఇచ్చిన సేవింగ్స్ అకౌంట్ నుంచే ప్రీమియం ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుంది. పాలసీదారుడు ఏ కారణంతో మరణించినా, కుటుంబానికి రూ.2 లక్షల మొత్తాన్ని అందిస్తారు. ఈ పాలసీ తీసుకునేందుకు ఎలాంటి వైద్య పత్రాలు లేక పరీక్షలు అవసరం లేదు.
ఈ భీమా సంవత్సరం జూన్ 1 నుంచి తదుపరి సంవత్సరం మే 31 వరకు అమల్లో ఉంటుంది. సమయానికి ఖాతాలో డబ్బులు లేక ప్రీమియం డెబిట్ కాకపోతే పాలసీ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. మరలా పాలసీ కొనసాగించాలంటే కొత్తగా దరఖాస్తు చేయాలి. తాజాగా పాలసీ తీసుకునేవారికి ఒక నెలపాటు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు మాత్రమే భీమా క్లెయిమ్ వర్తిస్తుంది.
55
ఇప్పటి వరకు లాభపడినవారి సంఖ్య
ఈ పథకంలో ఇప్పటివరకు 23 కోట్లకు పైగా సభ్యులు చేరారు. దాదాపు 9.20 లక్షల కుటుంబాలు భీమా మొత్తాన్ని పొందాయి. మొత్తం రూ.18,000 కోట్లకుపైగా పరిహారం లబ్ధిదారుల కుటుంబాలకు చేరింది. ఇందులో పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం ద్వారా లాభపడటం విశేషం.