చదివింది డిగ్రీలే.. కాని వ్యాపారంలో టాప్ బిజినెస్ ఉమెన్ గా మారి రూ.కోట్లు సంపాదిస్తున్నారు

First Published | Nov 20, 2024, 11:50 AM IST

జీవితం నేర్పిన బిజినెస్ పాఠాలు వారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే భారతదేశంలో టాప్ బిజినెస్ ఉమెన్స్ గా నిలిచారు.  సుధా మూర్తి నుండి రేష్మా కేవల్రామణి వరకు వాళ్లు ఏం చదువుకున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం రండి. 

భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది. అందులో బిజినెస్ ఉమెన్ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బిజినెస్ ఉమెన్ అంటే స్వశక్తితో కంపెనీలు, ఫౌండేషన్స్ స్టార్ట్ చేసి విజయవంతంగా రన్ చేస్తున్నారు. ఇండియాలో టాప్ బిజినెస్ ఒమెన్ గా నిలిచిన పలువురు మహిళల ఎడ్యుకేషన్ బ్యాగ్రౌండ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ హెడ్ సుధా మూర్తి ఐఐఎస్సీ లో చదివారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని పెళ్లి చేసుకున్నారు. రూ.కోట్ల ఆస్తి ఉన్నా సింప్లిసిటీకి ప్రత్యక్ష నిదర్శనంగా ఉంటారు.  సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొంటారు. సాయం చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు.  

బయోకాన్ లిమిటెడ్, బయోకాన్ బయోలాజిక్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ అయిన కిరణ్ మజుందార్ షా 1968 లో బిషప్ కాటన్ గర్ల్స్ హైస్కూల్ లో చదువు పూర్తి చేశారు.


పెప్సికో మాజీ CEO ఇందిరా నూయి ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. 1975 లో మద్రాస్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1976 లో ఐఐఎం కలకత్తా నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లోనూ డిగ్రీ పొందారు.

ఫ్యాషన్, బ్యూటీ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అయిన నైకా CEO ఫాల్గుని నాయర్ కేవలం డిగ్రీ పట్టా పొందారు.  సైడెన్హామ్ కాలేజీలో బి.కాం చదివారు. కాని ఫ్యాషన్ రంగంలో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు. 

శివ్ నాడార్ కూతురు రోష్ని నాడార్ HCL ఎంటర్ప్రైజెస్ CEOగా వ్యవహరిస్తున్నారు. ఈమె నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ చదివారు. కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుండి MBA పట్టా పొందారు. శివ్ నాడార్ వారసురాలుగా వార్తల్లో నిలిచారు.

USV ఇండియా ఛైర్ పర్సన్ లీనా గాంధీ తివారీ కూడా బికాం పట్టా పొందారు. బోస్టన్ యూనివర్సిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు.

గోద్రేజ్ ఫ్యామిలీకి చెందిన స్మితా కృష్ణ ముంబైలోని జె.బి. పెటిట్ స్కూల్ లో చదువు పూర్తి చేశారు. సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి పొలిటికల్ సైన్స్, హిస్టరీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

Zoho సాఫ్ట్ వేర్ స్టార్టప్ కో-ఫౌండర్ అయిన రాధా వేంబు. ఆమె శ్రీధర్ వేంబు సోదరి కూడా. చెన్నైలోని నేషనల్ హైయర్ సెకండరీ స్కూల్ లో చదువుకున్నారు. ఐఐటీ మద్రాస్ నుండి ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పొందారు.

వెర్టెక్స్ ఫార్మాస్యూటికల్స్ బయోటెక్ కంపెనీ CEOగా వ్యవహరిస్తున్న రేష్మా కేవల్రామణి బోస్టన్ యూనివర్సిటీ నుండి లిబరల్ ఆర్ట్స్, మెడికల్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2015 లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి జనరల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ, మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ నుండి ఫెలోషిప్ కూడా పొందారు.

Latest Videos

click me!