వాట్సాప్‌లో లేదా టికెట్ స్క్రీన్‌షాట్ చూపిస్తే చెల్ల‌దు.. ఇండియన్ రైల్వే కీలక హెచ్చరిక

Published : Jul 11, 2026, 07:36 PM IST

Indian Railways: రైలు ప్రయాణం చేసే వారు ఇకపై టికెట్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్‌లో వచ్చిన టికెట్ ఫొటో లేదా స్క్రీన్‌షాట్ చూపిస్తే అది చెల్లుబాటు అయ్యే టికెట్‌గా పరిగణించబోమని భారతీయ రైల్వే స్ప‌ష్టం చేసింది. 

PREV
15
వాట్సాప్ స్క్రీన్‌షాట్ ఎందుకు చెల్లదు?

ఇటీవల చాలా మంది ప్రయాణికులు టికెట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకుని లేదా వాట్సాప్‌లో ఫార్వర్డ్ చేసి ప్రయాణిస్తున్నారు. అయితే అలాంటి చిత్రాలను ఎడిటింగ్ చేసే అవకాశం ఉండటంతో పాటు, ఒకే టికెట్‌ను పలువురికి పంపించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే టికెట్ ఎగ్జామినర్లు వాటిని సరైన ప్రయాణ రుజువుగా అంగీకరించరని రైల్వే శాఖ తెలిపింది.

25
టికెట్ తనిఖీ సమయంలో ఏవి చూపించాలి?

ఈ-టికెట్‌తో ప్రయాణించే వారు కింది వాటిలో ఏదో ఒకటి తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలి. IRCTC Rail Connect యాప్‌లో ఉన్న అసలు ఈ-టికెట్. బుకింగ్ చేసిన తర్వాత వచ్చిన SMS నిర్ధారణ సందేశం. అధికారిక బుకింగ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో కనిపించే టికెట్. అవసరమైతే అసలు ఈ-టికెట్ ప్రింట్ కాపీ. టికెట్‌లో ఉన్న పేరుకు సరిపోలే ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ తదితరాలు). టికెట్‌లో ఉన్న పేరు, గుర్తింపు కార్డులోని పేరు ఒకేలా ఉండాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

35
స్క్రీన్‌షాట్ మాత్రమే ఉంటే ఏమవుతుంది?

ఒకవేళ ప్రయాణికుడి వద్ద వాట్సాప్‌లో వచ్చిన స్క్రీన్‌షాట్ మాత్రమే ఉండి, అసలు టికెట్ చూపించలేకపోతే, టికెట్ లేనట్లుగానే పరిగణించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో కొత్త టికెట్ కొనుగోలు చేయాల్సి రావచ్చు. నిబంధనల ప్రకారం జరిమానా విధించవచ్చు. అవసరమైతే రైల్వే చట్టాల ప్రకారం చర్యలు కూడా తీసుకోవచ్చు. అందువల్ల కేవలం స్క్రీన్‌షాట్‌పై ఆధారపడకుండా అసలు టికెట్‌ను సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.

45
వాట్సాప్‌లో టికెట్ షేర్ చేయొచ్చా?

కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు సమాచారం కోసం టికెట్‌ను వాట్సాప్‌లో పంపుకోవచ్చు. అయితే ఆ ఫొటో లేదా స్క్రీన్‌షాట్‌ను మాత్రమే చూపించి ప్రయాణించడం సరైన విధానం కాదని రైల్వేలు స్పష్టం చేశాయి. ప్రయాణించే వ్యక్తి వద్ద అసలు ఈ-టికెట్ లేదా అధికారిక బుకింగ్ నిర్ధారణ తప్పనిసరిగా ఉండాలి.

55
ప్రయాణికులకు రైల్వే సూచనలు

రైలు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ సూచనలు పాటించాలని రైల్వే శాఖ సూచిస్తోంది. మొబైల్‌లో అసలు ఈ-టికెట్‌ను భద్రంగా ఉంచుకోండి. బుకింగ్ తర్వాత వచ్చిన SMS‌ను డిలీట్ చేయకుండా సేవ్ చేసుకోండి. తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డు వెంట ఉంచుకోండి. కేవలం వాట్సాప్ స్క్రీన్‌షాట్ లేదా ఫార్వర్డ్ చేసిన టికెట్‌పై మాత్రమే ఆధారపడకండి. డిజిటల్ బుకింగ్‌లు పెరిగిన నేపథ్యంలో ఈ సూచనలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తదుపరి రైలు ప్రయాణానికి వెళ్లే ముందు మీ వద్ద అసలు ఈ-టికెట్ లేదా అధికారిక బుకింగ్ రుజువు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. దీంతో జరిమానాలు, ఆలస్యం, ఇతర ఇబ్బందులను సులభంగా నివారించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories