Indian Railway: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఈ యాప్‌తో టికెట్ బుక్ చేసుకుంటే డిస్కౌంట్

Published : Jan 17, 2026, 03:10 PM IST

Indian Railway: రైలు టికెట్ బుక్ చేసుకోవ‌డం కోసం ర‌క‌ర‌కాల యాప్స్‌, వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయ‌న్న విష‌యం తెలిసిందే. కేంద్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో న‌డిచే రైల్ వ‌న్ యాప్ ఉప‌యోగిస్తున్న వారికి ఇండియ‌న్ రైల్వే ఒక శుభ‌వార్త తెలిపింది. 

PREV
15
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్

భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. రైల్ వన్ యాప్ ద్వారా ముందస్తు రిజర్వేషన్ లేని టికెట్లు బుక్ చేస్తే 3 శాతం వరకు తగ్గింపు అందించనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం.

25
రైల్ వన్ యాప్‌లో కొత్త మార్పు

ఇంతకుముందు రైల్ వన్ యాప్ వాలెట్ ద్వారా చెల్లింపు చేస్తేనే 3 శాతం డిస్కౌంట్ ఉండేది. ఇప్పుడు ఆ నిబంధనలో మార్పు చేసింది. ఇకపై యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వంటి ఏ డిజిటల్ పేమెంట్ విధానం ఉపయోగించినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది.

35
డిస్కౌంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు

ఈ ప్రత్యేక రాయితీ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు అమల్లో ఉంటుంది. ఈ కాలంలో ప్రయాణికులు రైల్ వన్ యాప్ వాలెట్ ఉపయోగించినా, ఇతర డిజిటల్ పేమెంట్లు ఉపయోగించినా 3 శాతం తగ్గింపు పొందవచ్చు.

45
ఏ టికెట్లకు వర్తిస్తుంది

ఈ ఆఫర్ కేవలం రైల్ వన్ యాప్ ద్వారా బుక్ చేసే ముందస్తు రిజర్వేషన్ లేని రైలు టికెట్లకే వర్తిస్తుంది. ఇతర యాప్‌లు లేదా వెబ్‌సైట్ల ద్వారా బుక్ చేసిన టికెట్లకు ఈ డిస్కౌంట్ వర్తించదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

55
ప్రయాణికులకు లాభం ఏంటి.?

డిస్కౌంట్ వల్ల టికెట్ ధరలో కొంత మేర తగ్గింపు లభిస్తుంది. తరచుగా రైలు ప్రయాణం చేసే వారికి ఇది ఖర్చు తగ్గించే అవకాశం. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో క్యాష్ అవసరం కూడా తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories