Foldable iPhone: త్వరలో రాబోతున్న ఫోల్డబుల్ ఐఫోన్ అల్ట్రా, అద్భుతమైన ఫీచర్లు ఇవిగో

Published : Apr 21, 2026, 09:56 AM IST

Foldable iPhone: యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. దీనికి 'ఐఫోన్ అల్ట్రా' అని పేరు పెట్టనున్నట్లు సమాచారం. ఇదే అత్యంత హై-ఎండ్ ఐఫోన్ కూడా అవుతుంది. ఐఫోన్ అల్ట్రాలో ఎన్నో ప్రధాన ఫీచర్లతో రాబోతోంది.

PREV
14
ఫోల్డబుల్ యాపిల్ ఫోన్

ఇదివరకే ఫోల్డబుల్ ఫోన్లు ఎన్నో వచ్చాయి. కానీ ఐఫోన్ లో మాత్రం ఇంతవరకు ఇలాంటి ఫోన్ రాలేవు. ఇప్పుడు యాపిల్ ‘ఐఫోన్ అల్ట్రా’ పేరుతో ఫోల్డబుల్ ఫోన్ లాంఛ్ చేయబోతోంది. చాలా భిన్నమైన డిజైన్‌తో ఇది రాబోతోంది. ఇది పుస్తకంలా మడిచేలా ఉంటుందని సమాచారం. తెరిస్తే ఐప్యాడ్ మినీ సైజులో ఉంటుంది. లోపలి స్క్రీన్‌పై మడత కనిపించకుండా ఉంటుందని అంచనా. దీనికి టైటానియం బాడీ ఉంటుందని కూడా చెబుతున్నారు.

24
రెండు డిస్‌ప్లేలు

ఐఫోన్ అల్ట్రా బయటి డిస్‌ప్లే 5.3 నుంచి 5.5 అంగుళాల సైజులో ఉంటుందని అంచనా. అదే సమయంలో లోపలి డిస్‌ప్లే సైజు 7.6 నుంచి 7.8 అంగుళాల వరకు ఉండొచ్చు. బయటి స్క్రీన్ ఐఫోన్ మినీని, లోపలి స్క్రీన్ ఐప్యాడ్ మినీని గుర్తుకు తెస్తాయి.

34
డ్యూయల్ రియర్ కెమెరా

ఐఫోన్ అల్ట్రా వెనుక భాగంలో రెండు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో ఒకటి 48-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్. రెండోది 48MP అల్ట్రా-వైడ్ లెన్స్. అయితే, ఎక్కువ జూమ్ చేసే టెలిఫోటో లెన్స్ ఈ ఫోన్‌లో ఉండకపోవచ్చు. రెండు డిస్‌ప్లేలలో హోల్-పంచ్ డిజైన్‌తో 18MP సెల్ఫీ కెమెరా ఉంటుందని అంచనా.

ఈ ఫోన్‌ను మినీ ఐప్యాడ్‌లా కూడా వాడొచ్చు కాబట్టి, మల్టీ-టాస్కింగ్‌పై ఎక్కువ దృష్టి పెడతారు. ఐఫోన్ అల్ట్రా కోసం ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఉండొచ్చు. ఐప్యాడ్ లాంటి లేఅవుట్ కూడా రావచ్చు. ఈ ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27 అని కూడా చెబుతున్నారు.

44
యాపిల్ సిలికాన్: A20 ప్రో చిప్

యాపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ అల్ట్రాలో లేటెస్ట్ A20 ప్రో చిప్, యాపిల్ సొంత C2 సెల్యులార్ మోడెమ్ ఉండనున్నాయి. సెప్టెంబర్‌లో లాంచ్ కానున్న ఐఫోన్ 18 ప్రోలో కూడా ఇదే చిప్, మోడెమ్ ఫీచర్లు ఉంటాయని అంచనా. టెక్నికల్‌గా 12GB LPDDR5 ర్యామ్ కూడా ఉంటుంది.

యాపిల్ ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో ఫేస్ ఐడీ ఇవ్వకపోవచ్చు. దానికి బదులుగా, ఐఫోన్ అల్ట్రాలో టచ్ ఐడీని చేర్చే అవకాశం ఉంది. ఇది పవర్ బటన్‌తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. ఈ టెక్నాలజీ ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీలో ఉన్నట్లే ఉండొచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories