Inspiring Story: టిక్‌టాక్‌లో సరదాగా పచ్చళ్ల రీల్స్ షేర్ చేసుకునే ఇద్దరు ఫ్రెండ్స్..ఇప్పుడు ఏకంగా ఓ ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. లీయా మార్కస్, యాసమన్ భక్తియార్ అనే ఈ ఇద్దరు అమ్మాయిల సక్సెస్ స్టోరీ ఇది.
లీయా మార్కస్ (26), యాసమన్ భక్తియార్ (27) యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్ అయ్యారు. 2022లో చదువు పూర్తయ్యాక, 2023లో పచ్చళ్లు, స్నాక్స్‌కు సంబంధించిన టిక్‌టాక్ వీడియోలను ఒకరికొకరు షేర్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇంటర్నెట్‌లో పచ్చళ్ల కంటెంట్ బాగా ట్రెండ్ అయ్యేది.
ఆ సరదా కాస్తా ఒక బిజినెస్ ఐడియాగా మారింది. ఇంకేముంది, 2023 సమ్మర్‌లో ఇద్దరూ తమ ఉద్యోగాలకు రిజైన్ చేసి, లాస్ ఏంజిల్స్ కేంద్రంగా ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్ వాల్యూ సుమారు రూ.81 కోట్లకు చేరుకుంది.
24
'హాట్ గర్ల్' పచ్చళ్ల ఎంట్రీ
వీళ్లిద్దరూ కలిసి 'గుడ్ గర్ల్ స్నాక్స్' అనే కంపెనీని స్థాపించారు. ఫిబ్రవరి 2024లో తమ మొదటి ప్రొడక్ట్ 'హాట్ గర్ల్' పచ్చళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. మొదట్లో మధ్యవర్తులు లేకుండా తమ సొంత వెబ్‌సైట్ ద్వారానే కస్టమర్లకు డైరెక్ట్‌గా అమ్మారు. టేస్ట్, ప్యాకేజింగ్ మీద ఫీడ్‌బ్యాక్ తీసుకుని ప్రొడక్ట్‌ను మరింత మెరుగుపరిచారు. పెద్ద ఇన్వెస్టర్ల దగ్గరకు వెళ్లేముందు వీళ్లు తమ ఫ్రెండ్స్, ఫ్యామిలీ నుంచే పెట్టుబడి సేకరించారు.
34
సూపర్ మార్కెట్లలోకి ఎంట్రీ.. ఫండింగ్
ఆన్‌లైన్ సేల్స్ సక్సెస్ అయ్యాక, అమెరికాలోని ఫేమస్ సూపర్ మార్కెట్లలో తమ ప్రొడక్ట్స్ అమ్మాలని వీళ్లు డిసైడ్ అయ్యారు. 2025లో ఫేమస్ 'హోల్ ఫుడ్స్ మార్కెట్', ప్రీమియం గ్రోసరీ స్టోర్ 'ఎరెవాన్' (Erewhon)లో తమ పచ్చళ్లను అమ్మేందుకు అప్రూవల్ తెచ్చుకున్నారు. దీంతో ఆఫ్‌లైన్‌లోనూ బ్రాండ్ రేంజ్ పెరిగిపోయింది.
దీనికి తోడు, సీడ్ ఫండింగ్ రౌండ్‌లో ఈ కంపెనీ 3 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించింది. దీంతో కంపెనీ మొత్తం వాల్యూ 8.5 మిలియన్ డాలర్లకు (మన కరెన్సీలో సుమారు రూ.81.4 నుంచి రూ.81.6 కోట్లు) చేరుకుంది.
కేవలం పచ్చళ్లతోనే ఆగిపోకుండా, ఇతర స్నాక్స్ ఐటెమ్స్‌ను కూడా మార్కెట్లోకి తేవాలని లీయా, యాసమన్ ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియా, కస్టమర్ రిలేషన్స్ బేస్‌గా వీళ్లు తమ బ్రాండ్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఇన్‌స్టాగ్రామ్ పేజీకి 1,80,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. కంపెనీ పెట్టుబడి, మార్కెట్ వాల్యూ డీటెయిల్స్ బయటకు వచ్చినా, తమ లాభాలు, ఆదాయం ఎంతనేది మాత్రం వీళ్లు ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు.