వివిధ రాబడుల ఆధారంగా సమయం.. లాభాల లెక్కలు
పెట్టుబడిపై వచ్చే రాబడి శాతం మారినప్పుడు, కోటి లేదా రెండు కోట్ల రూపాయల లక్ష్యం చేరుకోవడానికి పట్టే కాలం మారుతుంది. దాని పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి..
• వార్షిక రాబడి 10 శాతం ఉంటే: ఇందుకు మొత్తం 46 సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కాలంలో మీరు జమ చేసే మొత్తం రూ. 11.06 లక్షలు కాగా, కాంపౌండింగ్ ద్వారా వచ్చే ప్రయోజనం రూ. 1.89 కోట్లుగా ఉంటుంది.
• వార్షిక రాబడి 12 శాతం ఉంటే: ఇందుకు మొత్తం 40 సంవత్సరాల సమయం పడుతుంది. మీ మొత్తం జమ రూ. 9.68 లక్షలు అయితే, కాంపౌండింగ్ వల్ల సమకూరే లాభం రూ. 1.90 కోట్లుగా ఉంటుంది.
• వార్షిక రాబడి 15 శాతం ఉంటే: ఇందుకు 34 సంవత్సరాల సమయం పడుతుంది. ఇందులో మీ పెట్టుబడి మొత్తం రూ. 8.20 లక్షలు కాగా, చక్రవడ్డీ ద్వారా అదనంగా రూ. 1.92 కోట్ల ప్రయోజనం లభిస్తుంది. అయితే, మీరు 18 ఏళ్ల టైం తీసుకుంటే దాదాపు కోటీ రూపాయలు అందుతుంది.