OTT: Recharge plan: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌.. ఎలాగో తెలుసా.?

Published : Feb 24, 2025, 04:55 PM ISTUpdated : Feb 24, 2025, 07:59 PM IST

ప్రస్తుతం ఓటీటీల ప్రభావం పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అందువల్ల చాలా మంది థియేటర్‌లో చూసినా మళ్లీ ఇంట్లో వీక్షిస్తున్నారు. ఈ ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చాయి.  

PREV
15
OTT: Recharge plan: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌.. ఎలాగో తెలుసా.?
Netflix free

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాది ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న 'ఓజీ', నాని 'హిట్ 3', నాగచైతన్య 'తండేల్', సిద్ధు జొన్నలగడ్డ 'జాక్' సహా పలు కొత్త సినిమాల డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. అయితే, నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందే బెస్ట్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

25

ఎయిర్‌టెల్ రూ. 1798 ప్లాన్:

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ 5జీబీ డేటాతోపాటు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. ఇక రోజు 3జీబీ చొప్పున మొత్తం 252 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో స్పామ్ కాల్ అలర్ట్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌, అపోలో 24/7 సర్కిల్, ఉచిత హలోట్యూన్స్ వంటి బెనిఫిట్స్‌ పొందొచ్చు. 
 

35

వీఐ రూ. 1599 ప్లాన్‌: 

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉచితంగా పొందొచ్చు. 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. మొత్తం 210 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ పొందొచ్చు. అయితే ఎయిర్‌టెల్‌లో లభించినట్లు ఇతర బెనిఫిట్స్‌ ఉండవు. 
 

45
Reliance Jio Logo

జియో రూ. 1299 ప్లాన్‌: 

ఇది కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజూ 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తం 168 జీబీ డేటా పొందొచ్చన్నమాట. ఈ ప్లాన్‌లో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్ వెర్షన్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలను యాక్సెస్‌ చేసుకోవచ్చు. 

55

జియో రూ. 1799 ప్లాన్‌: 

నెట్‌ఫ్లిక్స్‌ ఉచితంగా అందిస్తున్న మరో బెస్ట్‌ ప్లాన్స్‌లో జియో రూ. 1799 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే రోజూ 3 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌, రోజుకు 100 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. అన్‌లిమిటెడ్‌ 5జీ డేటాతోపాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ సేవలను పొందొచ్చు. 
 

Read more Photos on
click me!

Recommended Stories