Gold Rates: బంగారం కొనలేమా..? ఈ ధరలు ఏంట్రా బాబు..!

Published : Feb 24, 2025, 11:22 AM IST

బంగారం ధరలు ఎవరూ ఊహించని ధరకు పెరిగిపోతున్నాయి. ఈ ధరలను చూస్తుంటే.. వాటిని కొనలేం అనే భావన పెరిగిపోతోంది. ఆ మధ్య కాస్త తగ్గినట్లే తగ్గినా, మళ్లీ పెరిగిపోతోంది. మరి, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..  

PREV
15
Gold Rates: బంగారం కొనలేమా..? ఈ ధరలు ఏంట్రా బాబు..!


బంగారం పై మక్కువ లేనివాళ్లు ఎవరైనా ఉంటారా? ముఖ్యంగా మన దేశంలో ప్రజలకు బంగారం పై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఇంట్లో చిన్నదో, పెద్దదో ఫంక్షన్ వచ్చినా, శుభకార్యం వచ్చినా కొంచెం అయినా బంగారం కొనాల్సిందే. కానీ, ఇప్పుడు పెరుగుతున్న  ధరలు చూస్తుంటే భవిష్యత్తులో బంగారం కొనలేమేమో అనే సందేహం కలుగుతోంది. ముఖ్యంగా 2025 లోకి అడుగుపెట్టిన తర్వాత పసిడి ధర రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. త్వరలోనే తులం బంగారం రూ.లక్షకు చేరువైైనా  ఆశ్చర్యపోనవసరం లేదు. మరి, ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

25
Gold


పెరుగుతున్న బంగారం ధరలతో పెళ్లికి నగలు కొనాలనుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు. అదే సమయంలో బంగారు నగలపై ఎక్కువగా పెట్టుబడి పెట్టిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చాకే  ఈ ధరలు పెరుగుతుండటం గమనార్హం.

35
Gold

వరసగా పెరుగుతూ వస్తున్న ఈ బంగారం ధర, రెండు రోజులుగా కాస్త ఊరటనిచ్చింది. స్వల్పంగా తగ్గినట్లే తగ్గి.. మళ్లీ ఈ రోజు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ80690 ఉండగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.88020గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.80550 కాగా.. 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.87870గా ఉంది.

45
Gold Rate

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.8,0550కు చేరుకోగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.87,870 వద్ద కొనసాగుతోంది.

55


ఇక, వెండి విషయానికి వస్తే దీని ధర కూడా  రోజు రోజుకీ పెరుగుతుండటం విశేషం. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.96,290గా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ వెండి రూ.96,460కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో రూ. 96,610గా ఉంది.

click me!

Recommended Stories