Google Pay Split Bill మీ బిల్లులు మీ ఫ్రెండ్స్ తో షేరింగ్.. గూగుల్ పే సూపర్ ఫీచర్!

Published : Feb 24, 2025, 09:00 AM IST

క్రెడిట్ కార్డు బిల్లు, గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు.. ఇలాంటివి మనకు చాలానే ఉంటాయి. అన్నింటినీ ఆన్లైన్లోనే చెల్లించేవాళ్లు ఎక్కువమందే ఉంటారు. ఇకపై ఈ బిల్లులను స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యులతో పంచుకునే సదుపాయాన్ని గూగుల్ పే తీసుకొచ్చింది. దీన్ని వాడటానికి మళ్లీ ప్రత్యేక యాప్ అవసరం లేదు. గూగుల్ పే యాప్‌లోని బిల్ స్ప్లిట్ ఫీచర్‌ను ఉపయోగించి బిల్లు మొత్తాన్ని సులభంగా పంచుకోవచ్చు.

PREV
13
Google Pay Split Bill మీ బిల్లులు మీ ఫ్రెండ్స్ తో షేరింగ్..  గూగుల్ పే సూపర్ ఫీచర్!
జిపే బిల్ స్ప్లిటింగ్

జిపేలోని ఈ ఫీచర్ తో మీ బిల్లుని ఇతరులకు పంచడం, వాళ్ల బిల్లులో భాగం తీసుకోవడం సులభం. ఆండ్రాయిడ్ లేదా iOS పరికరాల్లో GPay ద్వారా బిల్-స్ప్లిటింగ్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.

23
జిపే బిల్ పేమెంట్ గ్రూప్

దీనిని ఎలా ఉపయోగించాలంటే.. మీ మొబైల్‌లో GPay యాప్‌ను తెరిచి, హోమ్ స్క్రీన్ పైభాగంలో ఉన్న సెర్చ్ బాక్స్‌ను క్లిక్ చేయండి. మీరు బిల్లును పంచుకోవాలనుకునే స్నేహితులందరినీ కనెక్ట్ చేసి, గ్రూప్‌కు పేరు పెట్టండి. అంతే..

33
గూగుల్ పే బిల్ స్ప్లిటింగ్ ఆప్షన్

జిపే ద్వారా అనేక బిల్ స్ప్లిటింగ్ గ్రూపులను సృష్టించవచ్చు. బిల్లును ఎలా విభజించాలో నిర్ణయించిన తర్వాత, గ్రూప్‌లోని వ్యక్తులకు అభ్యర్థనను పంపవచ్చు. అయితే బిల్లులు కట్టలాంటే మాత్రం వాళ్ల ఆమోదం తప్పనిసరి.

click me!

Recommended Stories