OpenAI పరిచయం చేసి ChatGPT ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానమిస్తోంది. కొత్త ఆలోచనలను క్రియేట్ చేయడం, సింపుల్ గా, మనతో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ సమాచారం అందిస్తోంది. మరి WhatsApp ఏమో ఫ్రీగా మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపుకొనే వెసులుబాటు ఇస్తోంది. ఇప్పుడు ఈ రెండు కలిసి వినియోగదారులకు సేవలందినున్నాయి.
WhatsApp నుండి బయటకు వెళ్లకుండానే ChatGPT సేవలను మీరు యాక్సెస్ చేయవచ్చు. బ్రెయిన్ స్టార్మింగ్, కొత్త విషయాలను నేర్చుకోవడం లేదా సరదాగా, ఫ్రెండ్ లా మాట్లాడటం లాంటివి చాట్ జీపీటీతో చేయొచ్చు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం.