మీ జీతం రూ.30వేలేనా? అయినా నెలకు రూ.5వేలు ఆదా చేయచ్చు.. ఎలానో తెలుసా?

Published : Jun 23, 2025, 04:08 PM ISTUpdated : Jun 23, 2025, 04:10 PM IST

₹30,000 జీతంతో నెలకు ₹5,000 ఆదా చేయడం అసాధ్యమేమీ కాదు. 50-30-20 నియమం, స్మార్ట్ ప్లానింగ్‌తో ఏ ఉద్యోగినైనా పొదుపు చేయవచ్చు.

PREV
17
బడ్జెట్ ప్లానింగ్‌తో...

₹30,000 జీతం వస్తే, అది మొదటి వారంలోనే ఖర్చయిపోవడం చాలామందికి సాధారణమే. ఇంటి అద్దె, ఇఎంఐ, బిల్లు, రీఛార్జ్, ఆహార ఖర్చులు ఇలా చూస్తుంటే పదిరోజుల్లో ఖాతా ఖాళీ. కానీ ఇదే జీతంతో నెలాఖరున రూ.5,000 వరకూ పొదుపు చేయడం అసాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన బడ్జెట్ ప్లానింగ్‌తో, కొన్ని అలవాట్లలో మార్పుతో ఈ లక్ష్యం సాధ్యమే.

27
50-30-20 నియమం

మొదటగా, 50-30-20 నియమంను పాటించాలి. అంటే జీతంలో 50% అవసరమైన ఖర్చులకు, 30% వ్యక్తిగత వినోదం కోసం, 20% పొదుపు కోసం కేటాయించాలి. ఇలా చేయగలిగితే నెలకు కనీసం రూ.5,000 ఆదా చేయడం సాధ్యం.వినోద ఖర్చులుపై నియంత్రణ పెట్టాలి. తరచూ సినిమా, ఫుడ్ డెలివరీ, షాపింగ్ చేయడం తగ్గిస్తే, అదనంగా రూ.1,000-₹2,000 ఆదా అవుతుంది. అలాగే హోటళ్లలో తినడం తగ్గించి ఇంట్లో వంట చేయడం అలవాటు చేసుకుంటే, నెలకు ₹2,000 పొదుపు చేయొచ్చు.

37
పొదుపు ఖాతా ఓపెన్

పొదుపు ఖాతా ఓపెన్ చేయడం తప్పనిసరి. ఇంట్లో నగదు దాచడం కంటే వడ్డీ ఇస్తున్న బ్యాంకుల్లో సేవింగ్స్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయడం మంచిది. నెలకు కనీసం ₹2,000 జమ చేస్తే, సంవత్సరానికి రూ.24,000 పైగా పొదుపవుతుంది.ఇంటర్నెట్ సేవలుపై స్మార్ట్ ఆలోచన అవసరం. వ్యక్తిగత Wi-Fi కంటే, అపరిమిత డేటా ప్లాన్‌తో మొబైల్ వాడటం వల్ల నెలకు ₹300-₹500 ఆదా చేయొచ్చు.

47
రవాణా ఖర్చుల్లో

రవాణా ఖర్చుల్లో మార్పులు కూడా అవసరం. ప్రతిరోజూ బైక్ వాడితే పెట్రోల్‌కి ₹5,000 ఖర్చవుతుంది. బదులుగా బస్సు, మెట్రో వంటివి వాడితే రూ.1,500 వరకు ఆదా చేయొచ్చు.

57
ఫిక్స్‌డ్‌ డిపాజిట్

ఫిక్స్‌డ్‌ డిపాజిట్ (FD) పెట్టడం కూడా మంచి ఆర్థిక అలవాటు. నెలకు మిగిలిన మొత్తాన్ని FDలో వేస్తే, వడ్డీతో కలిపి దీర్ఘకాలంలో ఇది పెద్ద మొత్తంగా మారుతుంది.

67
అవసరమైనవి మాత్రమే

షాపింగ్ సమయంలో అనవసర ఖర్చులకు పోకుండా, అవసరమైనవి మాత్రమే కొనాలి. ఆన్‌లైన్ ఆఫర్లు, డిస్కౌంట్లు చూసి ప్లాన్ చేసుకుంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి.

77
సైడ్ ఇన్‌కమ్

అదనంగా, సైడ్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఉద్యోగం తర్వాత సమయం ఉంటే డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్యుటరింగ్, ఫ్రీలాన్స్ వర్క్‌లు చేయొచ్చు. ఇలా నెలకు అదనంగా ₹2,000–₹5,000 సంపాదించవచ్చు. ఇది పొదుపును మరింతగా బలపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories