FD Interest Rate: ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) అనగానే ముందుగా గుర్తుకొచ్చేది వడ్డీ రేటు. వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే రిటర్న్స్ ఎక్కువ వస్తుంది. అయితే.. జూన్ 2025లో ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించిన తరువాత ఎఫ్‌డీలపై అధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకులు ఏవి ?
ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2025లో రెపో రేటును 0.50 శాతం తగ్గించింది. ఈ చర్యతో బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లను సవరించాయి. ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున ఆర్థిక వృద్ధికి మద్దతుగా రెపో రేటును తగ్గించింది. దీని ఫలితంగా SBI, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ తదితర ప్రధాన ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు వెంటనే తమ డిపాజిట్ రేట్లను సవరించాయి.
కొత్త రేట్లు స్టాక్ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్లతో పోలిస్తే తక్కువగా ఉన్నప్పటికీ, సాంప్రదాయ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా మధ్యస్థం నుండి దీర్ఘకాలిక హోరిజోన్ ఉన్నవారికి, FDలు సురక్షితమైన పెట్టుబడి మార్గాలలో ఒకటి. వడ్డీ రేటు లో తగ్గింపు ఉన్నప్పటికీ, కొన్ని బ్యాంకులు రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులను ఆకర్షించేలా వడ్డీని అందిస్తున్నాయి.
25
వడ్డీ రేట్లు ఇలా
ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రధానమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుతం సాధారణ పౌరులకు 3.05% నుండి 6.45% వరకు వడ్డీని అందిస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 7.05% వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను అందిస్తోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 7.40% వరకు వడ్డీ అందిస్తోంది, అయితే కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకులు 5 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు దాదాపు 6.50% నుండి 6.90% వరకు వడ్డీ అందిస్తున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ చర్యకు ప్రతిస్పందనగా HDFC, ICICI వంటి ప్రైవేట్ రంగ సంస్థలు తమ వడ్డీ రేట్లను తగ్గించాయి. HDFC సాధారణ కస్టమర్లకు 6.40% వడ్డీ ఇస్తుండగా.. సీనియర్ సిటిజన్లకు 6.90% వడ్డీ రేటు అందిస్తుంది. ఇక ICICI బ్యాంక్ సాధారణంగా 6.60% వడ్డీ అందిస్తుండగా.. సీనియర్ సిటిజన్స్ కు 7.10% వడ్డీ అందిస్తున్నాయి. ఆక్సిస్ బ్యాంక్ 6.50% వడ్డీ ఇస్తుండగా.. YES బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 5 సంవత్సరాల డిపాజిట్‌పై 7.85% అందిస్తోంది.
35
అధిక రాబడినిచ్చే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు
స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు (SFBలు) ఈ సీజన్‌లో అధిక FD రేటు ప్రొవైడర్లుగా మారాయి. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సూర్యోదయ్ SFB వంటి 5 సంవత్సరాల డిపాజిట్లకు 8.25% నుండి 8.60% వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. కొన్ని పథకాలలో రేట్లు 9.10% వరకు ఇస్తున్నాయి. ప్రధాన బ్యాంకులతో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఎక్కువ రిస్క్.
ఐదేళ్లకు రూ. 5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే.. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం SBI లో మెచ్యూరిటీ సమయానికి రూ. 7.07 లక్షలు పొందుతారు. అంటే.. నికర వడ్డీ గా రూ. 2.07 లక్షలు పొందువచ్చు. ఇక ICICI బ్యాంక్ లో 6.60% వద్ద రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. ఐదేండ్లకు రూ. 7.15 లక్షలు పొందవచ్చు. HDFC బ్యాంక్ లో 6.40% వడ్డీ రేట్ వద్ద 5 లక్షలు డిపాజిట్ చేస్తే దాదాపు రూ. 7.05 లక్షలు పొందవచ్చు. YES బ్యాంక్‌లో 7.85% వడ్డీ రేట్ వద్ద డిపాజిట్ చేస్తే.. దాదాపు ₹8.19 లక్షలు పొందుతారు, ఐదేళ్లలో మొత్తం వడ్డీ ₹3.19 లక్షలకు పైగా సంపాదిస్తారు.
55
అత్యధిక ఎఫ్ డీ వడ్డీ రేట్లు
జూన్ 2025 FD రేటు సవరణలు సగటు రాబడిని తగ్గించినప్పటికి రిస్క్ తక్కువగా ఉండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పదవీ విరమణ చేసినవారు, జీతన జీవులు, సాంప్రదాయ పెట్టుబడిదారులకు అవి DICGC నిబంధనల ప్రకారం ఒక బ్యాంక్‌కు ₹5 లక్షల వరకు మూలధన భద్రత, భీమాను అందిస్తాయి. సీనియర్ సిటిజన్లకు, 8.2% అందించే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లేదా YES బ్యాంక్ 7.85% 5 సంవత్సరాల FD అవకాశాన్ని అందిస్తున్నాయి.