Published : Jun 12, 2025, 02:23 PM ISTUpdated : Jun 12, 2025, 02:35 PM IST
క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించే సమయంలో మనకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి... ఒకటి టోటల్ పేమెంట్స్, ఇంకోటి మినిమం పేమెంట్. ఇందులో ఏ పేమెంట్ ను ఎంచుకుంటే మంచిదో ఇక్కడ చూద్దాం.
బ్యాంక్ అకౌంట్ తెరిచిన వెంటనే మనం కోరుకున్నా, కోరకపోయినా మన పర్సులో ఏదో ఒక క్రెడిట్ కార్డ్ చేరుతుంది. ప్రస్తుతం ప్రతిఒక్కరికి ఒక సెల్ ఫోన్ ఉన్నట్లే ఒక్కొక్కరికి ఒక క్రెడిట్ కార్డ్ ఉండే పరిస్థితి ఇప్పుడు ఉంది. అయితే క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉందికదా అని చాలామంది చూసిచూడకుండా ఖర్చు చేస్తుంటారు… దీనివల్ల కొందరు లాభపడినా చాలామంది ఇబ్బందులు పడుతుంటారు.
క్రెడిట్ కార్డ్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. బిల్లు చెల్లించడంలో చిన్న తప్పులు చేసినా, అది పెద్ద భారాన్ని మోపుతుంది. క్రెడిట్ కార్డుల ద్వారా చేసే ఖర్చులకు 45 రోజుల వరకే వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉంటుంది… ఆలోపు చెల్లింపు చేస్తే సమస్య లేదు. గడువు దాటితే మాత్రం చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
27
మినిమం పేమెంట్ ను ఎలా నిర్ణయిస్తారు?
చాలామంది క్రెడిట్ కార్డును విరివిగా వాడతారు… తీరా బిల్లు చెల్లించే సమయానికి డబ్బులు లేక మొత్తం చెల్లించకుండా మినిమం డ్యూ పే చేస్తారు. ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
మినిమం డ్యూ అంటే మీరు ప్రస్తుతం చెల్లించాల్సిన మొత్తాన్ని తర్వాతి గడువులో చెల్లిస్తానంటూ పొడిగించడం అన్నమాట. క్రెడిట్ కార్డ్ కంపెనీ సాధారణంగా మీ బ్యాలెన్స్‌లో 5% నుండి 10% వరకు కనీస చెల్లింపుగా నిర్ణయిస్తుంది. ఉదాహరణకు మీకు రూ.10,000 బ్యాలెన్స్ ఉంటే, మీరు రూ.500 నుండి రూ.1000 వరకు మీనిమం పేమెంట్ గా చెల్లించాల్సి ఉంటుంది.
37
క్రెడిట్ కార్డ్ మినిమం పేపెంట్స్ వల్ల నష్టాలు
క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించే సమయంలో మొత్తం చెల్లింపు (టోటల్ అమౌంట్) కంటే దాని పక్కన ఉండే మినిమమ్ చెల్లింపు (మినిమమ్ అమౌంట్ డ్యూ) చాలామందిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే అది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి. అయితే మొత్తం చెల్లించడానికి డబ్బులు లేనప్పుడు మినిమమ్ చెల్లింపు చేయవచ్చు. మొత్తం చెల్లింపులో 5 శాతం మినిమమ్ డ్యూగా చెల్లించాల్సి ఉంటుంది.
కొందరు ఎప్పుడూ మినిమమ్ చెల్లింపును మాత్రమే చెల్లిస్తుంటారు. కానీ ఈ మినిమమ్ చెల్లింపులు పెద్ద భారాన్ని మోపుతాయని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. మినిమమ్ పేమెంట్ ద్వారా ఆలస్య రుసుము (లేట్ ఫీజు) వసూలు చేయరు కానీ మిగిలిన మొత్తానికి వడ్డీ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డ్ బిల్లు మినిమం చెల్లింపుల ద్వారా సిబిల్ స్కోర్ కూడా ప్రభావితమవుతుందట. కాబట్టి సిబిల్ స్కోర్‌ను పెంచుకోవాలనుకునేవారు ఖచ్చితంగా ఈ మినిమం చెల్లింపులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు, ప్రతి నెలా మొత్తం బిల్లు చెల్లింపు చేయడమే ఉత్తమమని అంటున్నారు ఒకవేళ చాలా పెద్ద మొత్తం చెల్లించాల్సి ఉంటే క్రెడిట్ కార్డ్ కంపెనీతో మాట్లాడి ఈఎంఐగా మార్చుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
57
క్రెడిట్ కార్డ్ మొత్తం బిల్లు కట్టడంవల్ల లాభాలు..
క్రెడిట్ కార్డ్ ఖాతాను మంచి స్థితిలో ఉంచుకోవడానికి సహాయపడుతుంది.
చెల్లింపులో తప్పులు లేకుండా ఉండటానికి సహాయపడుతుంది.
క్రెడిట్ స్కోర్ పాడవకుండా ఉండటానికి సహాయపడుతుంది.
67
క్రెడిట్ కార్డు బిల్లు మినిమం పేమెంట్ వల్ల నష్టాలు
క్రెడిట్ కార్డ్ బిల్లులో మినిమం పేమెంట్స్ మాత్రమే చేయడం వల్ల మిగిలిన మొత్తంపై వడ్డీ జోడించబడుతుంది, దీని వల్ల మీ అప్పు మరింత పెరుగుతుంది. ఈ మినిమం పేమెంట్ అప్పటికప్పుడు ఉపశమనం కలిగించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఆర్థిక సమస్యలను సృష్టిస్తుంది.
77
క్రెడిట్ కార్డు వాడేవారికి జాగ్రత్తలు
వీలైనంత వరకు మినిమం పేమేంట్స్ కంటే మొత్తం బిల్లును కట్టడానికి ప్రాధాన్యత ఇవ్వండి.