మీ చుట్టూ ఉన్నవి డెంగ్యూ దోమలేమో? ఇలా గుర్తించండి

First Published | Oct 20, 2024, 10:46 AM IST

మీ ఇంటి చుట్టూ దోమలు విపరీతంగా ఉన్నాయా? రోజూ మీరు దోమ కాటుకు గురవుతున్నారా? మిమ్మల్ని కుట్టిన దోమలు మామూలు దోమలో లేక డెంగ్యూ దోమలో తెలుసుకోవడం ఎలా? డెంగ్యూ దోమలను గుర్తించేందుకు ఇక్కడ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. మీ చుట్టుపక్కల ఉంటే డెంగ్యూ దోమలు ఉంటే వాటి నుంచి ఎలా రక్షణ పొందాలో ఇక్కడ తెలుసుకోండి. 

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జ్వరాలు తీవ్రంగా ఉన్నాయి. వాటిల్లో డెంగ్యూ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. సకాలంలో నివారణ చర్యలు తీసుకోకపోతే ఈ జ్వరాలు పెరిగిపోయి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అసలు డెంగ్యూ జ్వరం రావడానికి కారణమైన దోమలు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణ దోమలు కుడితే పెద్ద ప్రాబ్లమ్ కాదు. కాని కొన్ని రకాల దోమలు కుడితే డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర జ్వరాలు వ్యాపిస్తాయి. వీటిల్లో డెంగ్యూ వ్యాప్తికి కారణమైన దోమల లక్షణాలు, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

డెంగ్యూ జ్వరానికి కారణమైన దోమ పేరు ఏడెస్ దోమ. ఈ దోమలు ప్రధానంగా ఏడెస్ ఈజిప్టి, ఏడెస్ అల్బోపిక్టస్, డెంగ్యూ వైరస్, చికున్‌గున్యా, జికా, పసుపు జ్వరం వంటి ఇతర వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. కాబట్టి డెంగ్యూ దోమల గురించి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. 

డెంగ్యూ దోమ పరిమాణం మరియు ఆకారం

ఏడెస్ దోమలు చిన్నవి, ముదురు రంగులో ఉంటాయి. సాధారణంగా 4-7 మిల్లీమీటర్ల పొడవు, సన్నని శరీరాలు, పొడవైన కాళ్ళు కలిగి ఉంటాయి. వాటి విలక్షణమైన గుర్తులు ఇతర దోమల్లో అవి ఎక్కడున్నాయో గుర్తించేలా చేస్తాయి.

డెంగ్యూ దోమపై నలుపు, తెలుపు చారలు

ఏడెస్ దోమలకు నలుపు, తెలుపు చారలు ఉంటాయి. వాటి నల్లటి శరీరాలపై ఈ తెల్లని గుర్తులు అవి డెంగ్యూ దోమలను గుర్తించేలా చేస్తాయి. వీటి సెపరేట్ రంగులు ఇతర దోమల నుండి వీటిని వేరు చేసి మనం గుర్తించేలా చేస్తాయి. ఏడెస్ అల్బోపిక్టస్ లేదా ఆసియా టైగర్ దోమ వీపుపై ఒకే తెల్లటి చారను కలిగి ఉంటుంది.


డెంగ్యూ దోమలు పగటిపూట కుడతాయి

డెంగ్యూ దోమలు పగటిపూట, ముఖ్యంగా తెల్లవారుజామున, మధ్యాహ్నం చురుకుగా ఉంటాయి. అవి ఆ సమయంలోనే ఎక్కువ కుడతాయి. ఏడెస్ దోమలు రకరకాల బ్లడ్ గ్రూప్ లను ఇష్టపడతాయి. అందువల్లనే డెంగ్యూ జ్వరాలు వేర్వేరు బ్లడ్ గ్రూపులున్న వ్యక్తుల్లోనూ వ్యాప్తి చెందుతాయి. వేగంగా వ్యాపించడం వల్ల డెంగ్యూ జర్వ బాధితులు పెరిగిపోతూ ఉంటారు.

డెంగ్యూ దోమలు నిలిచి ఉన్న నీటిలో పెరుగుతాయి

ఏడెస్ దోమలు శుభ్రమైన నిలిచి ఉన్న నీటిలో పెరుగుతాయి. ఇవి తరచుగా పూల కుండీలు, స్టోర్ చేసిన టైర్లు, బకెట్లు, మూసుకుపోయిన కాలువలు, నీటి నిల్వ కంటైనర్లలో కనిపిస్తాయి. ఇవి పెరగడం కోసం చిన్న మొత్తంలో నీరు ఉన్నా సరిపోతుంది.

డెంగ్యూను ఎలా నివారించాలి?

ఏడెస్ దోమలను నియంత్రించడానికి అవి పెరిగే ప్రదేశాలను తొలగించడం ఉత్తమ మార్గం. నిలిచి ఉన్న నీటితో ఉన్న ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. నీటి నిల్వ కంటైనర్లను మూసి వేయండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. చిన్న గుంటలను కూడా పూడ్చివేయండి. 

నిమ్మకాయ యూకలిప్టస్ నూనెను ఉపయోగించడం ద్వారా ఈ  దోమ కాటు నుంచి రక్షణ పొందవచ్చు. ఏడెస్ దోమలు పగటిపూట చురుకుగా ఉంటాయి. దోమతెరలు ఉపయోగించడ ద్వారా కూడా వీటి నుంచి రక్షణ పొందవచ్చు. బయట ఉన్నప్పుడు పొడవాటి స్లీవ్‌లు, ప్యాంట్లు, సాక్స్‌లు ధరించండి. ముఖ్యంగా దోమలు ఎక్కువగా ఉన్నచోట లేత రంగు దుస్తులు వేసుకోవడం మంచివి. ఎందుకంటే దోమలు ముదురు రంగులకు  ఎట్రాక్ట్ అవుతాయి.

Latest Videos

click me!