UKలో రూ.40 లక్షలు జీతంతో ఉద్యోగాలు: మీరు అర్హులేనా?

First Published Oct 19, 2024, 3:56 PM IST

మీరు నిరుద్యోగులా? ఫారన్ వెళ్లి ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ ఆఫర్ మీరు సరిపోతుందేమో ఓ సారి చెక్ చేసుకోండి. ఇది యునైటెడ్ కింగ్‌డమ్(UK)లో చేయాల్సిన ఉద్యోగం. జీతం సుమారు రూ.40 లక్షల వరకు ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఈ స్టోరీ పూర్తిగా చదవండి. 
 

నర్సులకు అదిరిపోయే జాబ్ ఆఫర్ ఇది. ఇండియన్ కరెన్సీలో రూ.40 లక్షల వరకు జీతం పొందే అద్భుతమైన అవకాశం. భారీ జీతంతో పాటు IELTS/OET, CBT, NMC అప్లికేషన్ ఫీజు, వీసా, విమాన టికెట్లకు రీయింబర్స్‌మెంట్ కూడా ఇస్తారు. యునైటెడ్ కింగ్‌డమ్ (UK)లోని వేల్స్‌ ప్రాంతంలో నర్సింగ్ ఉద్యోగాల కోసం నోర్కా రూట్స్ అనే సంస్థ ఈ నియామకాలు నిర్వహిస్తోంది.
 

ఈ అర్హతలు మీకున్నాయా?

నర్సింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు ఇంటర్వ్యూకు ముందు కనీసం ఆరు నెలల పని చేసి అనుభవం ఉండాలి. అంటే జనరల్ నర్సింగ్, OT, హాస్పిటల్ ఆపరేషన్స్, థియేటర్, క్యాన్సర్ కేర్ డిపార్ట్ మెంట్స్ లో వర్క్ చేసి ఉండాలి. ఈ నియామకాలు నవంబర్ 12 నుండి 14 వరకు కేరళ రాష్ట్రం లోని ఎర్నాకులంలో జరుగుతాయి. 

స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్‌లలో IELTS స్కోరు 7 (రైటింగ్‌లో 6.5)ఉన్న వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా  OETలో స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్‌లలో B (రైటింగ్‌లో C+), నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కౌన్సిల్ (NMC) రిజిస్ట్రేషన్‌కు అర్హత ఉండాలి. IELTS/OET సర్టిఫికెట్ 2025 నవంబర్ 15 వరకు చెల్లుబాటు అయ్యేదిగా ఉండాలి.

Latest Videos


దరఖాస్తు ఎలా చేయాలి?

www.norkaroots.org వెబ్ సైట్ గాని, www.nifl.norkaroots.org వెబ్‌సైట్‌ను గాని సందర్శించండి. మీ వ్యక్తిగత వివరాలు, వర్క్ ఎక్స్‌పీరియన్స్ తెలిపే విధంగా  వివరణాత్మక CVని, దాంతో పాటు IELTS/OET స్కోర్ కార్డ్‌ ను ఉపయోగించి అక్టోబర్ 25 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులను 2025 మార్చి తర్వాత నియమిస్తారు.  
 

ఎంపికైన అభ్యర్థులకు రీయింబర్స్‌మెంట్ 

IELTS/OET, CBT, NMC అప్లికేషన్ ఫీజు, వీసా, విమాన టికెట్లకు రీయింబర్స్‌మెంట్ లభిస్తుంది. UKలో విమానాశ్రయం నుండి వసతి గృహానికి ప్రయాణం ఉచితం. అంతేకాకుండా ఒక నెల ఉచిత వసతి ప్రొవైడ్ చేస్తారు. OSCE పరీక్ష ఖర్చు కూడా ఎంపికైన అభ్యర్థులకు ఇస్తారు. 
 

NMC రిజిస్ట్రేషన్ ముందు UK కరెన్సీ ప్రకారం  £26,928 జీతం ఇస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.30 లక్షలు అన్న మాట. అదే NMC రిజిస్ట్రేషన్ తర్వాత బ్యాండ్ 5 జీతం చెల్లిస్తారు. అంటే UK కరెన్సీలో £30,420 నుంచి £37,030 జీతంగా ఇస్తారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 లక్షలు చెల్లిస్తారు. దీంతో పాటు 5 సంవత్సరాల వరకు రూ.5.74 లక్షలు స్పాన్సర్‌షిప్ కూడా లభిస్తుంది. 

మరిన్ని వివరాల కోసం నోర్కా గ్లోబల్ కాంటాక్ట్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్లు 1800 425 3939ను కాంటాక్ట్ అవ్వండి. మీరు భారతదేశం నుండి ఫోన్ చేయాలనుకుంటే +91-8802 012 345 ద్వారా సంప్రదించవచ్చు.
 

click me!