Money: రూపాయి ఖర్చు లేకుండా నెలకు లక్షల్లో సంపాదించడం సాధ్యమేనా? బిజినెస్ సీక్రెట్స్ మీ కోసం..

Published : May 01, 2026, 07:52 PM IST

Money: మనం సాధారణంగా "డబ్బు ఉంటేనే వ్యాపారం చేయగలం" అనుకుంటాం. కానీ, నిజమైన వ్యాపారం డబ్బుతో కాదు, అది మనం ఎదుటి వ్యక్తికి ఇచ్చే భరోసాతో మొదలవుతుందని బిజినెస్ నిపుణులు అంటున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

PREV
15
శ్రమ నీ ఆయుధం

ఒక అబ్బాయి ఒకప్పుడు పేపర్ వేస్తూ నెలకు కేవలం రూ. 1500 సంపాదించేవాడు. కానీ నేడు అదే వ్యక్తి కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు. అంటే, మన గతంతో సంబంధం లేకుండా, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఎవరైనా శిఖరాలను అధిరోహించవచ్చని ప్రముఖ బిజినెస్ నిపుణుడు చెప్పుకొచ్చారు.

25
సమయమే సంపద

చాలా మంది తమ ఖాళీ సమయాన్ని సోషల్ మీడియాలో వృథా చేస్తుంటారు. కానీ అదే సమయాన్ని మీ కెరీర్ బిల్డ్ చేయడానికి 'పెట్టుబడి'గా పెడితే, అది మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. సమయం ఎవరి కోసమూ ఆగదు, దాన్ని ఎలా వాడుకుంటున్నాం అనేదే మనల్ని ఇతరుల కంటే భిన్నంగా నిలబెడుతుంది.

35
నిజాయితీతో కూడిన మార్కెటింగ్

ఒక కస్టమర్ తో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. మార్కెటింగ్ అంటే వస్తువుని అమ్మడం కాదు, ఎదుటివారి అవసరాన్ని గుర్తించడం. అబద్ధాలు చెప్పి ప్లాట్లు అమ్మడం కంటే, కస్టమర్ భవిష్యత్తుకు ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉపయోగపడుతుందో వివరించడమే 'యూనిక్ కనెక్టింగ్ పాయింట్'. ఇదే మన విజయ రహస్యం.

45
మైండ్‌సెట్ మార్చుకో

మనలోని భయాలే మనకు అతిపెద్ద శత్రువులు. "నేను చదువుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాదు" అనే నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడాలి. బావిలో కప్పలా కాకుండా సముద్రంలో షార్క్ లా ఆలోచించడం మొదలుపెడితే, ఈ ప్రపంచంలో మీకు సాధ్యం కానిది ఏదీ లేదు.

55
గెలుపు పిలుపు

విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన తర్వాత లభించే గౌరవం, ఆత్మవిశ్వాసం చెప్పలేనంత కిక్కు ఇస్తుంది. కేవలం తనకోసమే కాకుండా, సమాజం కోసం ఏదైనా చేయాలనే తపన ప్రతి మనిషిలో ఉండాలి. పది మందికి దారి చూపే స్థాయికి ఎదిగినప్పుడే మన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుందని బిజినెస్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories