Lightweight Scooters: కాలేజీకి వెళ్లే అమ్మాయిల కోసం మరీ బరువు లేకుండా తేలికగా ఉండే బెస్ట్ స్కూటర్ల గురించి ఇక్కడ ఇచ్చాము. వీటి ధర తక్కువ కూడా. అలాగే ఇవి ఎక్కువ మైలేజ్ కూడా ఇస్తాయి. అవేంటో తెలుసుకోండి.
ఎన్నో ఏళ్లుగా అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ ఈ స్కూటీనే. దీని బరువు కేవలం 93 కిలోలు మాత్రమే. అందుకే దీన్ని చాలా సులువుగా హ్యాండిల్ చేయొచ్చు. పొట్టిగా ఉండే అమ్మాయిలు కూడా దీన్ని ఈజీగా నడపగలరు. ఇది లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.65,000 నుంచి మొదలవుతుంది.
25
యమహా ఫ్యాసినో 125 Fi హైబ్రిడ్ (Yamaha Fascino 125 Fi Hybrid)
ఈ స్కూటర్ 125సీసీ సెగ్మెంట్‌లో వచ్చే స్టైలిష్ బూక్. దీని బరువు 99 కిలోలు. బరువు తక్కువైనా, చూడటానికి పెద్ద బండిలా కనిపిస్తుంది. కాలేజీ అమ్మాయిలకు బాగా నప్పుతుంది. ఈ మోడల్ లీటర్‌కు సుమారు 55 నుంచి 60 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.95,000.
35
హీరో ప్లెజర్+ ఎక్స్‌టెక్ (Hero Pleasure+ XTEC)
హీరో సంస్థ ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా అమ్మాయిల కోసమే మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని బరువు 106 కిలోలు. కాలేజీ అమ్మాయిలు హ్యాండిల్ చేయడానికి బాగుంటుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కు 50 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.84,000. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, ప్రొజెక్టర్ హెడ్‌లైట్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి.
బరువు తక్కువగా ఉండి, అదిరిపోయే పికప్ ఇచ్చే స్కూటర్ టీవీఎస్ జెస్ట్ 110. ఈ మోడల్ బరువు 103 కిలోలు. ఇది లీటర్‌కు 48 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ స్కూటర్ సీటు కింద చాలా ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.74,000 నుంచి మొదలవుతుంది.
55
హోండా యాక్టివా 6G (Honda Activa 6G)
పైన చెప్పిన స్కూటర్లు అన్నింటితో పోలిస్తే దీని బరువు కొంచెం ఎక్కువే. ఇది 106 కిలోల బరువు ఉంటుంది. అయినా కూడా ఈ స్కూటర్‌ను నడపడం, టర్న్ చేయడం చాలా సులభం. ఇది లీటర్ పెట్రోల్‌కు 47 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఈ మోడల్ ధర రూ.92,000.