అయితే మనలో చాలా మంది ఆధార్ కార్డులో ఉన్న ఫొటోను చూసుకొని నవ్వుకుంటుంటారు. అందులో ఉంది అసలు తామేనా అనే సందేహం వస్తుంటుంది. అయితే ఆధార్ కార్డులో ఫొటోను మార్చుకోవడం చాలా సులభమని మీకు తెలుసా.? ఇంతకీ ఆధార్ కార్డులో ఫొటోను ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం.
* ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
* ఆ తర్వాత వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదు ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.
* అనంతరం ఫామ్‌లో పేర్కొన్న వివరాలన్నింటినీ అందించాలి.
* తర్వాత ఫామ్‌ను సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి లేదా ఆధార్ సేవా కేంద్రంలో సమర్పించాలి.
* ఆధార్ కేంద్రంలో, మీ వేలిముద్ర, ఐరిష్ స్కాన్‌తో పాటు మీ బయోమెట్రిక్ వివరాలను తీసుకుంటారు.
* బయోమెట్రిక్ వివరాలను నిర్ధారించుకున్న తర్వాత కొత్త ఫొటోను తీసుకుంటారు.