ప్రయాణికుల కోసం తయారు చేసే ఆహార పదార్థాల్లో వంట నూనె, బియ్యం, పప్పులు, మసాలాలు, పాల ఉత్పత్తులు అన్నీ మంచి బ్రాండ్ వాడుతున్నామని మంత్రి చెప్పారు. IRCTC సిబ్బంది రైళ్లలో ఉంటారని, ఫుడ్ ప్యాకెట్లపై QR కోడ్‌లు కూడా పెట్టామని దాని ద్వారా ఆ ఫుడ్ కి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
ప్యాంట్రీ కార్లలో ఆహారం పరిశుభ్రంగా ఉందో లేదో తనిఖీ చేస్తామని, కస్టమర్ల అభిప్రాయాలు కూడా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. FSSAI సర్టిఫికేషన్ కూడా తప్పనిసరి చేశామని అశ్విని వైష్ణవ్ అన్నారు.