ఒక మనిషి విమానంలో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లవచ్చు? ఈ రూల్స్ తెలుసుకోండి...

Ashok Kumar | Published : Oct 11, 2023 6:03 PM
Google News Follow Us

దేశీయ విమానంలో ఒక వ్యక్తి ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లవచ్చు ? టూర్ వెళ్లేందుకు  రెడీ అవుతున్నప్పుడు చాలామందికి వచ్చే డౌట్ ఇదే. ముఖ్యంగా  టూరిజం ప్రదేశాలలో మద్యం ధర మన దగ్గర ధర కంటే తక్కువగా ఉంటే, మనం ఎంత మద్యం తీసుకురావొచ్చు  అని ఆలోచిస్తుంటాం... 
 

13
 ఒక మనిషి విమానంలో ఎన్ని లీటర్ల మద్యం తీసుకెళ్లవచ్చు?  ఈ రూల్స్ తెలుసుకోండి...

దేశీయ విమానాల్లో మద్యం రవాణాపై ఆంక్షలు ఉన్నాయి. మద్య పానీయాల రవాణా కోసం ప్రభుత్వం అలాగే విమానయాన పరిశ్రమ ఏర్పాటు చేసిన నియమాలు ఇంకా  నిబంధనలను తెలుసుకోండి. 

ఒక వ్యక్తి కొన్ని పరిమితులతో వారి లగేజీలో ఐదు లీటర్ల వరకు ఆల్కహాలిక్ పానీయాలను తీసుకెళ్లడానికి  అనుమతించబడుతుంది. అయితే వీటిని చాలా నీట్ గా సేఫ్ గా ప్యాక్ చేయాలి. ఇందులో 70% కంటే ఎక్కువ ఆల్కహాల్ కంటెంట్ శాతం ఉండకూడదు. 

23

ఆల్కహాల్ కంటెంట్ 24 శాతం కంటే తక్కువ ఉన్న పానీయాలను తీసుకురావడానికి ఎటువంటి పరిమితులు లేవు. అంటే ఎయిర్‌లైన్  సాధారణ బ్యాగేజీ నిబంధనల ప్రకారం మీరు 24 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ కంటెంట్ ఉన్న ఏ సైజు బాటిల్‌నైనా తీసుకెళ్లవచ్చు.
 

33

ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ హోల్డ్ ఏరియాలో కొనుగోలు చేసినప్పుడు క్యారీ-ఆన్ బ్యాగ్‌లో ఆల్కహాల్ అనుమతించబడుతుంది. గరిష్టంగా 1 లీటరు కెపాసిటీ ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో లభించే మద్యం తప్పని సరిగా సీలు వేయాలి. ఈ బ్యాగ్‌లు దాదాపు 20.5 సెం.మీ x 20.5 సెం.మీ లేదా 25 సెం.మీ x 15 సెం.మీ లేదా దాదాపు  సైజ్ లో ఉండాలి ఇంకా ఆల్కహాలిక్ పానీయాలు ఉన్న బ్యాగ్ లోపల ప్లాస్టిక్ బ్యాగ్‌ను పూర్తిగా సీలు చేయాలి.

Related Articles

Share this Photo Gallery
Google News Follow Us
Recommended Photos