50 ఏళ్ల క్రితం కూడా దాడి!: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ ఇజ్రాయెల్‌లో యూదుల పండుగ (సూపర్‌నోవా పండుగ) రోజున దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదు. 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఇజ్రాయెల్‌పై దాడి జరిగింది. యూదుల పండుగ చాలా రోజుల పాటు కొనసాగుతుంది. 50 ఏళ్ల క్రితం పండుగ చివరి రోజున దాడి జరిగితే.. ఈసారి పండగ ప్రారంభంలోనే ఇజ్రాయిల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారని చాలా ఏళ్లుగా ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న ఆంథోనీ ఫెర్నాండెజ్ చెప్పారు.